Breaking News

మళ్లీ జన్మంటూ ఉంటే.. ఆడపిల్లగానే పుడతాం

Published on Wed, 03/08/2023 - 08:15

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మళ్లీ జన్మంటూ ఉంటే అమ్మాయిగానే పుడతామంటున్నారు నేటి మహిళలు. అబ్బాయికంటే అమ్మాయిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. కిందిస్థాయి ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నా.. ఉన్నతాధికారిణిగా ఉన్నా.. పని ప్రదేశాల్లో వేధింపులు ఎదురవుతున్నా వాటని్నంటిని అధిగవిుస్తూ స్వతంత్రంగా జీవిస్తున్నారు. సొంతింట్లోనే ఆడ మగ వివక్ష ఉన్నా, సోషల్‌ మీడియా ద్వారా టీజింగ్‌ ఎదురవుతున్నా వాటిని అధిగవిుస్తూ ముందుకు సాగుతున్నారు. తమకు శిక్షించే అధికారం లభిస్తే మహిళలపై హింస, ఇతరత్రా నేరాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు.

ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో వివిధ రంగాలకు చెందిన మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యారంగం, ఆర్టీసీ, పోలీసు, అంగన్‌వాడీ తదితర ప్రభుత్వ రంగాలకు చెందిన  ఉద్యోగులు, ప్రైవేట్‌ ఉద్యోగులు, టీచర్లు ఈ సర్వేలో భాగస్వాములయ్యారు. నల్ల గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఒక్కో జిల్లాలో వంద మంది చొప్పున 300 మంది మహిళలు పాలు పంచుకున్నారు. తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్ల డించారు. వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలివే..

►మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 300 మంది మహిళలు, 
ఉద్యోగినులు, విద్యార్థినులకు నాలుగు ప్రశ్నలు వేసి వారి అభిప్రాయాలను తీసుకున్నాము. 

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలి. తల్లిగా లాలిస్తూ, భార్యగా బాగోగులు చూస్తూ నిరంతరం పనిచేసే గొప్ప సేవకురాలు మహిళ. అలాంటి మహిళలు ఇంటికే పరిమితం కావద్దు. బాగా చదువుకుని ఉద్యోగాలు సాధించి వివిధ రంగాల్లో రాణించాలి. అప్పుడే ఆయా రంగాలతోపాటు సమాజం మరింత అభివృద్ధి చెందుతుంది.
– బి.సునీత, స్టాఫ్‌ నర్స్, సూర్యాపేట 

చిన్న విషయాలకు నిరుత్సాహ పడొద్దు
ప్రతి చిన్న విషయానికి నిరుత్సాహానికి గురికావద్దు. మహిళ పుట్టుకతోనే శక్తివంతురాలు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ కుటుంబాన్ని, పిల్లలను ఒకస్థాయిలో నిలబెడుతుంది. మహిళలు చిన్న విషయాలకు కుంగిపోతే జీవితంలో ఏమీ సాధించలేరు. సోషల్‌ మీడియా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు దూరంగా ఉండాలి. చిన్న కారణాలకే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థినులను చూస్తున్నాం. అది కరెక్ట్‌ కాదు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి సమస్య అయినా ఎదురొడ్డి నిలబడాలి.    

– నళిని, హెల్త్‌ అసిస్టెంట్, నల్లగొండ 

భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి
మహిళా దినోత్సవం జరుపుకోవడం అంటే ఆటలాడి, పాటలు పాడి కేకులు కోసి సంబరాలను జరుపుకోవడం కాదు. ఎవరో నలుగురికి శాలువాలు కప్పి సన్మానించడం అంతకంటే కాదు. ప్రతి మహిళ తన జీవితంలో సాధించిన ప్రగతిని సమీక్షించుకుని భవిష్యత్‌లో చేయాల్సిన అంశాలకు బాటలు వేసుకొని, వాటి అమలుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవడమే అసలైన మహిళా దినోత్సవం.   
 – ఉప్పల పద్మ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, మిర్యాలగూడ 

ఉన్నత చదువులతోనే రాణింపు
సమాజంలో సగ భాగమైన మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే ఉన్నత చదువులు చదవాలి. ప్రభుత్వాలు మహిళల కోసం మరిన్ని చట్టాలను తీసుకురావాలి. మహిళలకు ఎన్నో చట్టాలు ఉన్నా ప్రస్తుతం ఎక్కడో ఒకచోట వివక్ష తప్పడం లేదు.
– మోహన, బీటెక్, ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాల, సూర్యాపేట 

అన్నింటా సమానత్వం ముఖ్యం
ప్రతి ఒక్క రంగంలో పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలి. లైంగిక దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు ఉండాలి. 
మహిళా స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రభుత్వాలు పనిచేయాలి.    
– కానుగు సాయి ప్రసన్న, ప్రైవేట్‌ ఉద్యోగిని, వంగపల్లి, యాదాద్రి జిల్లా 

వివక్షలేని సమాజాన్ని నిర్మించాలి
మహిళలపై నేటి సమాజంలో వివక్ష ఎక్కువగా ఉంది. ప్రతి ఇంట్లో మగ పిల్లలు చెల్లి, అక్క, తల్లితో ఎలా మెలుగుతున్నారో బయట సమాజంలో కూడా అలానే ఉండేలా తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. మహిళలపై వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. 
– కడియం రాజేశ్వరి, మహిళా కానిస్టేబుల్, 
మిర్యాలగూడ వన్‌టౌన్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)