Breaking News

గర్భిణికి సాయం చేసిన ఆర్టీసీ సిబ్బందికి సజ్జనార్‌ సన్మానం

Published on Sun, 07/07/2024 - 04:47

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సిటీ బస్సులో పురిటి­నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి సాయం అందించి సుఖ ప్రసవానికి కారకులైన సంస్థ కండక్టర్, డ్రైవర్‌ను టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. ఈ మేరకు కండక్టర్‌ సరోజ, డ్రైవర్‌ ఎంఎం అలీలను హైదరాబాద్‌ బస్‌ భవన్‌­లో శనివారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారి.. తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయా­ణించేలా బస్‌ పాస్‌ను అందిస్తున్నట్లు ప్రకటించారు.

ఆర్టీసీ బస్సులు, బస్‌స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్‌ పాస్‌ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు పుట్టిన రోజు కానుకగా బస్‌ పాస్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ముషీరాబాద్‌ డిపోకు చెందిన 1 జెడ్‌ రూట్‌ బస్సులో శుక్రవారం ఉదయం ఆరాంఘర్‌లో శ్వేతా రత్నం అనే గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. కండక్టర్‌ ఆర్‌.సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేయడం తెలిసిందే. 

గర్భిణి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. సన్మాన కార్యక్రమంలో సీవోవో డాక్టర్‌ రవీందర్, జాయింట్‌ డైరెక్టర్‌ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, హైదరాబాద్‌ ఆర్‌ఎం వరప్రసాద్, ముషీరాబాద్‌ డీఎం కిషన్‌ తదితరులు పాల్గొన్నారు. 

శిశువుకు బర్త్‌ సర్టిఫికెట్‌
ఆర్టీసీ బస్సులో ప్రసవించిన మహిళ బిడ్డకు భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు జీహె­చ్‌ఎంసీ అధికారులు జనన ధ్రువపత్రం జారీ చేశారు. ప్రసవం జరిగిన ప్రదేశం జీహెచ్‌ఎంసీ మూడు సర్కిళ్ల పరిధిలో ఉన్నందున, జనన ధ్రువ పత్రం ఎక్కడ తీసుకో­వాలో అన్న అవగాహన లేక భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అధికారులు గుర్తించారు. సంబంధిత బర్త్, రిజిస్ట్రార్‌ ద్వారా బేబీ ఆఫ్‌ శ్వేతా రత్నం అని పేర్కొంటూ బర్త్‌ సర్టిఫికెట్‌ ఇప్పించారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)