Breaking News

3న శిల్పకళా వేదికలో చింగ్‌ హార్ట్స్‌..

Published on Sat, 07/20/2024 - 11:49

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నేపథ్య గాయిని మంగ్లీ స్వరాలతో నగరంలోని శిల్పకళా వేదికగా ‘చింగ్‌ హార్ట్స్‌’ పేరుతో లైవ్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌ను నిర్వహించనున్నారు. ఆగస్టు 3న జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రామానాయుడు స్టూడియోస్‌ వేదికగా సింగర్‌ మంగ్లీ, జబర్‌దస్త్‌ ఫేం బుల్లెట్‌ భాస్కర్, సంస్థ సభ్యులు అరుణ ప్రదీప్, విజయలక్షి్మ, సాయి గౌరీ, శ్రీ వల్లి ఆవిష్కరించారు.  

 35వ వార్షికోత్సవం నేపథ్యంలో..
నిరాదరణకు గురైన బాలికలు, అనాథ చిన్నారులకు అన్నీ తామై చూసుకుంటోంది నగరంలోని సాయి సేవా సంఘ్‌ సామాజిక సేవా సంస్థ. 35వ వార్షికోత్సవం సందర్భంగా చిన్నారుల సహాయార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 2 వేల మంది బాలికలకు ఉచిత విద్య, వసతితో పాటు వారికి అవసరమైన సంపూర్ణ ఆరోగ్య సంరక్షణను అందింస్తుంది. నృత్యం, సంగీతం వంటి విభిన్న కళల్లో శిక్షణ అందిస్తుంది.  

ఆ సంస్థ వల్లే..ఈ స్థాయికి...
ఏ ఆధారం లేని బాలికల ఆలనా పాలనా చూసుకోవడం అనిర్వచనీయమని మంగ్లీ అన్నారు. తనని కూడా ఆర్‌టీడీ అనే సంస్థ చేరదీయడం వల్లే ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. ఇంతటి సేవను అందిస్తున్న సాయి సేవా సంఘ్‌ సంస్థ కోసం తాను కన్సర్ట్‌లో పాడుతున్నానని, బుక్‌ మై షో టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బునే కాకుండా వ్యక్తిగతంగా లక్ష రూపాయలను విరాళంగా అందిస్తానని ప్రకటించారు. ఇందులో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి సీతక్కతో పాటు జబర్ధస్త్‌ ఫేం ఆటో రామ్‌ ప్రసాద్, బుల్లెట్‌ భాస్కర్, నాటీ నరేష్‌ వంటి ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)