Breaking News

ఒకేసారి కాదు.. దశల వారీగా పరిష్కారం

Published on Mon, 04/28/2025 - 06:12

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లు.. వారి సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట హామీ కాకుండా, దశల వారీ పరిష్కార హామీ ఇచ్చి సమ్మెకు చెక్‌ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెల ఏడో తేదీ నుంచి సమ్మె చేస్తామంటూ సంస్థ కార్మిక సంఘాలతో కూడిన ఓ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దానికి మరో జేఏసీ, ఇతర సంఘాలు అంతగా సానుకూలంగా లేకపోవటంతో సమ్మె విజయవంతం విషయంలో డోలాయ­మానం నెలకొంది. 

దీంతో ప్రభుత్వం కూడా సమ్మె విషయంలో అంత ఆందోళనగా లేదని సమాచారం. అసలు సమ్మెనే మొదలు కాకుండా చూసేందుకు చర్యలు ప్రారంభించింది. 21 అంశాలను పేర్కొంటూ ఓ జేఏసీలోని కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. అయితే డిమాండ్లకు సంబంధించి ఎప్పటిలోగా పరిష్కరించేది, ఎంత మొత్తం నిధులు విడుదల చేసేది.. స్పష్టంగా చెప్ప­కుండా, ఓ ఏడాది కాలంలో పరిష్కరిస్తాం అనే తరహా హామీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 

రిటైర్డ్‌ అధికారుల సమావేశంలో సంకేతాలు..: ఆర్టీసీ రిటైర్డ్‌ అధికారులకు ఆర్థిక పరమైన బకాయిల అంశం చాలా కాలంగా పెండింగ్‌ లో ఉంది. పలు సందర్భాల్లో రిటైర్డ్‌ ఉద్యో గులు బస్‌భవన్‌ ఎదుట ధర్నాలు చేశారు. వాటిని చెల్లించాలని వినతిపత్రాలు సమ ర్పించారు. కానీ అవి పరిష్కారం కాలేదు. ఆర్టీసీ రిటైర్డ్‌ అధికారుల సంఘం ఐదో వార్షిక సమావేశం ఆదివారం ఓ హోటల్‌లో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌లు హాజరయ్యారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతోపాటు వారి డిమాండ్ల పరిష్కారానికి దృష్టి సారిస్తున్నామని పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్‌ ఆఫీసర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.  

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)