Breaking News

ఒక్క రోజే 65 లక్షల మంది ప్రయాణం 24 కోట్ల రూపాయల ఆదాయం

Published on Wed, 06/12/2024 - 04:42

సాక్షి, హైదరాబాద్‌ :  ఒకే రోజు బస్సుల్లో 65 లక్షల మందిని గమ్యం చేర్చి ఆర్టీసీ మరో రికార్డు సృష్టించింది. సోమవారం రోజున ఈ ఘనత చోటు చేసుకుంది. సాధారణ రోజులతో పోలిస్తే సోమవారాల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు. ఈ పదో తేదీ సోమవారం రోజున ఆ రద్దీ మరింత ఎక్కువగా నమోదైంది. ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడూ రికార్డు కాని రీతిలో ఏకంగా 109.8 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. బస్సులన్నీ కిక్కిరిసి ప్రయాణించటంతో ఆర్టీ సీకి 24 గంటల్లో ఏకంగా రూ.24.06 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో జీరో టికెట్ల వాటా కూడా ఉంది. 

ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు కొనుగోలు చేసిన జీరో టికెట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీ సీకి రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. వాటితో కలుపుకొని ఈ రికార్డు స్థాయి ఆదాయాన్ని ఒకే రోజు ఆర్టీసీ పొందినట్టయింది. ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తేనే..ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. సోమవారాల్లో ఆ రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. దీంతో గత కొన్ని నెలలుగా సోమవారాల్లో ఆర్టీసీ అధిక ఆదాయాన్ని సాధిస్తోంది. 

జీరో టికెట్ల రూపంలో రికార్డుస్థాయిలో ఆదాయం నమోదవుతున్నా, ఆర్టీ సీకి మాత్రం అదే రోజు ఆ ఆదాయం రావడం లేదు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా, ప్రతినెలా ఆ మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లిస్తేనే దాన్ని ఆదాయంగా పరిగణించాల్సి వస్తుంది. కానీ, పాత బకాయిలతోపాటు, ఈ ఆదాయం మొత్తంగా ఇప్పటి వరకు ఆర్టీ సీకి అందలేదని తెలుస్తోంది. గతేడాది బడ్జెట్‌కు సంబంధించిన బకాయిలతో కలుపుకుంటే ఆర్టీ సీకి ప్రభుత్వం రూ.2200 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. 

కానీ, ఇప్పటి వరకు అంతమొత్తం విడుదల కాలేదు. ఇక 2015 వేతన సవరణకు సంబంధించి బాండ్ల డబ్బులు కూడా పూర్తిస్థాయిలో అందలేదు. ఆ మొత్తానికి సంబంధించిన నిధులు ఆర్టీ సీకి విడుదల చేస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించినా, కేవలం డ్రైవర్లకు మాత్రమే ఆ నిధులందాయి. మిగతావారు ఎదురుచూస్తున్నారు. దీనికి కూడా నిధులు లేకపోవటమే కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు కాగితాలపై రికార్డు స్థాయి ఆదాయం నమోదైనా.. ప్రభుత్వం రీయింబర్స్‌ చేసినప్పుడే అది నిజం ఆదాయంగా ఆర్టీసీ పరిగణించాల్సి ఉంటుంది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)