Breaking News

ఆర్టీసీ బస్సుల్లోనూ రెట్రో ఫిట్‌మెంట్‌

Published on Tue, 01/20/2026 - 06:24

సాక్షి, హైదరాబాద్‌: పాత డీజిల్‌ బస్సులను కూడా రెట్రో ఫిట్‌మెంట్‌ పద్ధతిలో ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చుకోబోతోంది. డీజిల్‌ బస్సుల్లోంచి ఇంజిన్లు తొలగించి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్‌ మోటార్ల (బ్యాటరీ బస్సుల్లో వినియోగించేవి)ను అమర్చటం ద్వారా ఆ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా వాడుకోనుంది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో ప్రైవేట్‌ సంస్థలను ఆశ్రయించింది. ఇందుకు ఆసక్తి చూపుతూ రెండు సంస్థలు ముందుకొచ్చాయి. ఈ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు ఓ ఉన్నతస్థాయి కమిటీని వేశారు. మరో మూడునాలుగు రోజుల్లో ఆ కమిటీ నివేదిక ఇస్తుంది. ఆ మేరకు ప్రైవేట్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని బస్సులను అప్పగించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.  

పెట్టుబడి ప్రైవేట్‌ సంస్థలదే... 
డీజిల్‌ బస్సులను రెట్రో ఫిట్‌మెంట్‌తో ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చుకునే పరిజ్ఞానం కొన్నేళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చింది. ఐదారేళ్లుగా ఆర్టీసీ కూడా దీని అనుసరణకు ప్రయతి్నస్తోంది. కానీ, అది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో... పెట్టుబడి పెట్టే సంస్థల కోసం ఎదురుచూస్తూ వస్తోంది. గతంలో ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇవ్వటంతో రెండు సంస్థలు ముందుకొచ్చాయి. ఇటీవలే ఆ సంస్థలు కొటేషన్‌ ఇవ్వగా, వాటితో సంప్రదింపులు జరిపి కొంతమేర ఆ మొత్తాన్ని తగ్గించుకోగలిగింది.

ప్రస్తుతం ఒప్పందాలకు సిద్ధమైంది. ఇప్పుడు రెట్రో ఫిట్‌మెంట్‌ భారాన్ని ఆ సంస్థలే భరిస్తాయి. సొంత ఖర్చుతో డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చి ఆర్టీసీకి అందిస్తాయి. ఏడేళ్ల కాలంలో ఆ మొత్తాన్ని వడ్డీతో కలిపి ఆర్టీసీ సమ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఏడేళ్లపాటు ఆ సంస్థలే బస్సులను నిర్వహిస్తాయి. ఇందుకు కిలోమీటరుకు రూ.20 నుంచి రూ.25 మధ్య సర్విసు చార్జీని ఆర్టీసీ వాటికి చెల్లిస్తుంది. ఏడేళ్ల ఒప్పందం తీరిపోగానే ఆ బస్సుల్లోని ఎలక్ట్రిక్‌ మోటార్లు సహా ఇతర వ్యవస్థలు ఆర్టీసీ సొంతమవుతాయి. అప్పుడు ఆ మోటార్లను తిరిగి ఇతర డీజిల్‌ బస్సుల్లో అమర్చి వాటిని బ్యాటరీ బస్సులుగా వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది.  

ఒక్కో బస్సుకు రూ.65 లక్షలు  
ఒక్క డీజిల్‌ బస్సును ఎలక్ట్రిక్‌ బస్సుగా మార్చేందుకు రూ.65 లక్షల వరకు ఖర్చవుతుందని తేల్చారు. ఈ మొత్తాన్ని తొలుత ఆ కంపెనీలే భరించి మారుస్తాయి. ఏడేళ్లలో ఈ మొత్తాన్ని తిరిగి ఆర్టీసీ నుంచి వడ్డీతో వసూలు చేసుకుంటాయి. ఏడేళ్లపాటు డీజిల్‌ బస్సు నిర్వహణ, అంతే సమయంలో రెట్రో ఫిట్‌మెంట్‌ బస్సు సిద్ధం చేసి నిర్వహించటం... ఈ రెండు ఖర్చులను సరిపోల్చి చూశారు. ఆరేళ్లలోనే రెట్రో ఫిట్‌మెంట్‌ వ్యయం తీరిపోతుందని తేలింది. అంటే, ఓ ఏడాది పాటు డీజిల్‌ బస్సు నిర్వహణ ఖర్చు మిగులుతుంది. ఇది ఆర్టీసీకి భారీ ఆదా.  

⇒  ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న ఎలక్ట్రిక్‌ బస్సులను గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేట్‌ సంస్థల నుంచి అద్దెకు తీసుకుంటున్నారు. కండక్టర్‌ మినహా ఆ బస్సులో పనిచేసే సిబ్బంది అంతా ప్రైవేట్‌ సంస్థకు చెందిన వారే. అప్పుడు ఆర్టీసీలోని ఆయా సిబ్బందికి పనిలేకుండా పోతుందని సంస్థ భావిస్తోంది. కానీ, వారికి జీతభత్యాలు మాత్రం ఠంచన్‌గానే చెల్లించాల్సి ఉంటుంది. అదే రెట్రో ఫిట్‌మెంట్‌ ఎలక్ట్రిక్‌ బస్సుల్లో సిబ్బంది అంతా ఆర్టీసీ వారే. వారికి చెల్లించే జీతభత్యాలకు తగ్గట్టుగా వారి వినియోగం ఉంటుంది. ఇక ప్రస్తుతం బ్యాటరీ బస్సుల నిర్వహణలో ఆర్టీసీ సిబ్బందికి పరిజ్ఞానం లేదు. రెట్రో ఫిట్‌మెంట్‌ బస్సులను సొంత సిబ్బందే నిర్వహించనుండటంతో సిబ్బంది వాటిపై పూర్తి అవగాహన వస్తుంది. భవిష్యత్‌లో వాటి నిర్వహణ సులభమవుతుంది.

200 బస్సులతో మొదలు
ప్రస్తుతం 200 సిటీ బస్సులను ప్రైవేటు సంస్థలకు కేటాయించే అవకాశం ఉంది. ఆ బస్సులను సిటీలో తిప్పుతారు. వాటి పనితీరు మెరుగ్గా ఉంటే తదుపరి మరిన్ని బస్సులను మారుస్తారు. ఏడేళ్ల తర్వాత ఈ 200 బస్సుల్లోని పరికరాలను మరో 200 బస్సుల్లోకి మార్చి వాటిని ఎలక్ట్రిక్‌ బస్సులుగా రోడ్డుపైకి తెస్తారు.    

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)