Breaking News

5 రోజుల్లో రూ.140 కోట్ల ఆదాయం

Published on Wed, 08/13/2025 - 05:53

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ ఆదాయ ఆర్జనలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. కేవలం ఐదు రోజుల్లో రూ.140 కోట్ల ఆదాయాన్ని సాధించింది. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం నుంచి సోమవారం వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉండటంతో బస్సుల్లో అధిక రద్దీ ఉంటుందని ముందుగానే ఊహించి స్పేర్‌ బస్సులు సహా అన్ని బస్సులను రోడ్డెక్కించింది. సిబ్బందికి సెలవులు, వీక్లీ ఆఫ్‌లు రద్దు చేసి అందరూ విధుల్లో ఉండేలా చూసింది. 

విశ్రాంతి లేకుండా ఆర్టీసీ సిబ్బంది బస్సులను నడిపి ఐదు రోజుల్లో 3.07 కోట్ల మంది (రిపీటెడ్‌ ప్యాసెంజర్స్‌)ని గమ్యస్థానాలకు చేర్చారు. ఐదు రోజుల్లో ఏకంగా 2.10 కోట్ల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయి. సగటున ఒక్కో బస్సులో 110 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. కొన్ని రకాల సెస్‌లు కూడా కలిపితే ఆదాయం మొత్తం రూ.160 కోట్లకు చేరుకోవటం విశేషం. గత ఏడాది రాఖీ పౌర్ణమితో పోలిస్తే ఈసారి దాదాపు రూ.40 కోట్లు అధికంగా ఆదాయం లభించింది. 

మహిళలే అధికం..
ఐదు రోజుల్లో 3.07 కోట్ల టికెట్లు జారీ కాగా, ఇందులో ఉచిత ప్రయాణాలకు సంబంధించిన జీరో టికెట్లు 2.09 కోట్లు కావటం విశేషం. ఈ జీరో టికెట్ల మొత్తం విలువ రూ.76 కోట్లుగా నమోదైంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్‌ చేయాల్సి ఉంటుంది. రాఖీ పౌర్ణమి పండుగ రోజైన శనివారం 66.40 లక్షల మంది ప్రయాణించటం ద్వారా సంస్థకు రూ.33.40 కోట్ల ఆదాయం సమకూరింది. 

సోమవారం 68.45 లక్షల మంది ప్రయాణించగా రూ.32.61 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది రాఖీపౌర్ణమి రోజున 62.86 లక్షల మంది ప్రయాణించగా, టికెట్ల రూపంలో రూ.31.86 కోట్ల ఆదాయం సమకూరింది. 2023లో ఈ మొత్తం రూ.22.65 కోట్లు మాత్రమే కావటం విశేషం.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)