Breaking News

అద్దెబస్సులపై ఆర్టీసీ కీలక ప్రకటన

Published on Fri, 07/24/2026 - 23:27

సాక్షి, హైదరాబాద్: టీజీఎస్ ఆర్టీసీ పరిధిలో సేవలు అందిస్తున్న అద్దె బస్సు యజమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీలో అద్దె బస్సుల కొనసాగింపు మరియు నిర్వహణకు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రభుత్వ ఆదేశాలకు, సంస్థ నిబంధనలకు లోబడి అత్యంత పారదర్శకంగా తీసుకోబడతాయని తెలిపింది. కాబట్టి యజమానులు ఎటువంటి అభద్రతాభావానికి గురికావాల్సిన అవసరం లేదని ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 

ప్రకటనలో.. కొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అద్దె బస్సు యజమానులను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడంతో పాటు ప్రభుత్వం, ఆర్టీసీ లో అధికారులను మేనేజ్ చేయడానికి డబ్బు అవసరమని అద్దె బస్సు యజమానుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చింది. ఇటువంటి వదంతులు మరియు దుష్ప్రచారాల వల్ల యజమానుల ప్రయోజనాలకే తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
 

ఆర్టీసీలో అన్ని నిర్ణయాలు అత్యంత పారదర్శకంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అద్దె బస్సు యజమానులందరూ  అప్రమత్తంగా ఉండాలని, అనధికారిక ప్రచారాలను గానీ, సంఘాల మాటలను గానీ నమ్మి ఎవరూ మోసపోవద్దని సవినయంగా కోరుతోంది. సంస్థ అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా పరిగణించాలని సూచించింది. అనవసర ప్రచారాలకు లొంగి సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే దానికి సంబంధిత వ్యక్తులే బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుచేస్తూ, ప్రశాంత వాతావరణంలో సంస్థతో సహకరించాలని ఆర్టీసీ పేర్కొంది

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)