Breaking News

యాదాద్రి జిల్లాలో విషాదం.. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు బోల్తా

Published on Wed, 09/20/2023 - 14:42

సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృత్యువాతపడగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తొర్రూరు నుంచి హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు ఉదయం 10 గంటలకు బయలుదేరింది.

కాగా జిల్లాలోని అడ్డగూడూర్ మండలం బొడ్డుగూడెం వద్దకు రాగానే అతి వేగం కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి పల్టీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే ఇద్దరు మరణించారు. మృతులను అడ్డ గూడూరు మండలం చిన్నపడిశాలకు చెందిన చుక్క యాకమ్మ అనే మహిళ, బీబీనగర్‌కు చెందిన కొండా రాములుగా గుర్తించారు. కొండ రాములు అడ్డగూడూరు  మండలం కోటమర్తి గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు తేలింది.

మరో 10 మందికి పైగా గాయపడ్డారు. మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: రితీ సాహా మృతిపై వైద్యుల కమిటీ విచారణ

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)