Breaking News

అద్దం కనిపిస్తలేదు.. స్టీరింగ్‌ తిరుగుతలేదు...

Published on Fri, 08/23/2024 - 04:47

హుజూరాబాద్‌: ‘ఫుట్‌బోర్డుపై మీరు నిలబడితే నాకు సైడ్‌ మిర్రర్‌ కనిపిస్త లేదు. అద్దం చూడకుండా బస్సు నడపలేను. ఇంతమందితో బస్సు ముందుకు పోవాలంటే కష్టమే.. కనీసం స్టీరింగ్‌ తిరుగుతలేదు. కొందరు దిగాల్సిందే..’అంటూ ఓ ఆర్టీసీ డ్రైవర్‌ బస్సును నడిరోడ్డుపై నిలిపివేశాడు. 

ఈ సంఘటన కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు వరంగల్‌కు వెళ్తోంది. దారిలో హుజూరాబాద్‌ బస్టాండ్‌లో ఆగింది. అప్పటికే బస్సునిండా ప్రయాణికులు ఉన్నారు. నిల్చునేందుకు కూడా స్థలం లేదు. అయినప్పటికీ బస్టాండులో వరంగల్‌ వెళ్లేవారు మరికొంతమంది ఎక్కారు. డ్రైవర్‌ ఓవర్‌ లోడ్‌ అవుతోందని, బస్సు నడిపే పరిస్థితి ఉండదని ప్రయాణికులను వారించినా వినిపించుకోలేదు. 

బస్సు బస్టాండ్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత డ్రైవర్‌కు సైడ్‌ మిర్రర్‌ కనిపించడం లేదు. దీంతో అద్దం కనిపించడం లేదని, వెనకనుంచి వచ్చే వాహనాలను గమనించకుండా బస్సుని నడపలేనని డ్రైవర్‌ బస్సును రోడ్డుపై నిలిపివేశాడు. ఇంతమంది ఎక్కితే కనీసం బస్సు స్టీరింగ్‌ తిరగడం లేదని చెప్పాడు. ప్రయాణికులు సహకరించి కొందరు దిగిపోవాలని అభ్యరి్థంచాడు. దీంతో కొంతమంది దిగిపోవడంతో బస్సు వరంగల్‌ బయల్దేరింది.  

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)