Breaking News

డ్రైవర్‌ ‘దేముడు’

Published on Tue, 01/27/2026 - 03:47

చౌటుప్పల్‌: హఠాత్తుగా ఆ బస్సు డ్రైవర్‌ గుండెలో అలజడి మొదలైంది.. మృత్యువు తనను కబళించడానికి సిద్ధంగా ఉందని అతనికి అర్థమైంది. కానీ, బస్సులో ప్రయాణికుల క్షేమమే లక్ష్యమైంది. తనను నమ్ముకున్న వారు సురక్షితంగా గమ్యం చేరాలని తపించిన ఆ డ్రైవర్‌ పోరాటం చివరికి విషాదాంతంగా మిగిలింది. తమ ప్రాణా­లు కాపాడిన డ్రైవర్‌ మరణంతో ప్రయాణికుల గుండె బరువెక్కింది. విజయవాడ సమీపంలోని కామయ్యతోపు ప్రాంతానికి చెందిన కట్టవరపు నాగ­రాజు (40), విజయవాడ–1 డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి విజయవాడ నుంచి గరుడ బస్సులో ప్రయాణికులతో బయలుదేరి సోమవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు.

తిరిగి మధ్యాహ్నం మియాపూర్‌ నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని విజయవాడకు బయలుదేరారు. ఎల్బీనగర్‌ దాటిన తర్వాత నాగరాజుకు ఛాతీలో నొప్పి మొదలైంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద బస్సు ఆపి, మెడికల్‌ షాపులో ట్యాబ్లెట్లు కొనుగోలు చేసి వేసుకున్నారు. అయితే చౌటుప్పల్‌ వచ్చేసరికి నొప్పి మళ్లీ తీవ్రమైంది. ఆ స్థితిలో కూడా ఎంతో బాధ్యతగా బస్సును సురక్షితంగా బస్టాండ్‌లోకి మళ్లించి, సర్వీస్‌ రోడ్డులో నిలిపివేశారు.  

చివరి శ్వాస వరకు బాధ్యత 
బస్సు ఆపిన తర్వాత ప్రయాణికులకు విషయం చెప్పి, వారు వేరే బస్సులో వెళ్లాలని సూచిస్తూ బస్సు నంబర్, ఇతర వివరాలను స్వయంగా వివరించారు. అనంతరం ఆటోలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లారు. అక్కడ వైద్యులు అందు­బాటులో లేకపోవడంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్తుండగా.. మార్గంమధ్యలోనే కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మొదటిసారి నొప్పి వచ్చినప్పుడే చికిత్స పొంది ఉంటే ప్రాణాలు దక్కేవని వైద్యులు అభిప్రాయపడ్డారు. బస్సు అటెండర్‌ ముదిగంటి చంద్రారెడ్డి నుంచి ఆర్టీసీ అధికారులు వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)