Breaking News

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిస్పెన్సరీలు

Published on Tue, 12/03/2024 - 04:33

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు, రిటైరైన సిబ్బంది ఇకపై ఉచిత చికిత్సల కోసం తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి వరకు రావాల్సిన బాధ తప్పనుంది. ఆర్టీసీ ఆసుపత్రికి అనుబంధంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీలను ఆసుపత్రులుగా మారుస్తుండటమే అందుకు కారణం. నిధుల సమస్యతో ఇంతకాలం డిస్పెన్సరీలను బాగుచేయలేని పరిస్థితి నెలకొనగా తాజాగా వాటిని ఉద్యోగులకు చేరువ చేసేలా ఎండీ సజ్జనార్‌ చర్యలు తీసుకున్నారు. 

వైద్యులు.. పరికరాలు.. మందులు.. 
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14 చోట్ల ఆర్టీసీ డిస్పెన్సరీలున్నాయి. వాటిల్లో నాలుగు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. కానీ కొన్ని డిస్పెన్సరీల్లో వైద్యులు లేరు. అలాగే ఎక్కడా కూడా వైద్య పరికరాలు లేవు. ఇప్పుడు అన్ని డిస్పెన్సరీలకూ వైద్యులను కేటాయించారు. నలుగురు వైద్యులను ప్రభుత్వం కేటాయించగా మిగతా వైద్యులను, టెక్నీíÙయన్లను అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఆర్టీసీ సమకూర్చుకుంది. వారు స్థానికంగా అందుబాటులో ఉంటూ సాధారణ చికిత్సలకు పూర్తిస్థాయిలో సేవలందించనున్నారు. 

అయితే ఎమర్జెన్సీ కేసులకు మాత్రం కీలక చికిత్సలు డిస్పెన్సరీల్లో ఉండవు. అత్యవసర వైద్యం అవసరమయ్యే రోగులు ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రికో లేదా ఆర్టీసీ రిఫరల్‌ జాబితాలోని ప్రైవేటు ఆసుపత్రులకో వెళ్లే వరకు అవసరమయ్యే ప్రాథమిక చికిత్సలు అందిస్తారు. అలాగే అన్ని రకాల మందులను కూడా డిస్పెన్సరీల్లో సమకూరుస్తున్నారు. ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వారు మందుల కోసం ప్రతిసారీ హైదరాబాద్‌కు రావాల్సి వస్తోంది. 

ఇకపై డిస్పెన్సరీల్లోనే ఉచితంగా మందులు అందిస్తారు. మరోవైపు కొత్తగా ఏర్పడ్డ పెద్ద జిల్లా కేంద్రాల్లో కూడా డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంలో భాగంగా తాజాగా నాగర్‌కర్నూల్‌లో డిస్పెన్సరీ ఏర్పాటైంది. మిగతా వాటిల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)