Breaking News

హైదరాబాద్‌లో బస్సు చార్జీల పెంపు

Published on Sun, 10/05/2025 - 06:21

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలోని సిటీ బస్సుల చార్జీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు  రవాణా సంస్థ పెంచింది. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో డీజిల్‌ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్‌ బస్సులనే తిప్పనుండటంతో అందుకయ్యే మౌలికవసతుల కల్పనకు కావాల్సిన నిధుల కోసం సిటీ బస్సు చార్జీలను పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం తాజాగా అనుమతించింది. దసరా వేళ చార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉండటంతో పండుగ రద్దీ ముగిశాక పెంచాలని నిర్ణయం తీసుకుంది. చార్జీల పెంపు సోమవారం తెల్లవారుజామున తొలి సర్వీసు నుంచి అమల్లోకి రానుంది. 

పెంపు ఇలా... 
ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్‌ ఆర్డినరీ, ఎలక్ట్రిక్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో తొలి మూడు స్టేజీల వరకు ప్రస్తుత టికెట్‌ ధరపై రూ. 5 పెరగనుంది. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో కనీస చార్జి రూ. 10గా ఉండగా ఇకపై రూ. 15 కానుంది. నాలుగో స్టేజీ నుంచి ప్రస్తుత చార్జీపై రూ. 10 అదనంగా పెరుగుతుంది. ఇక మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్‌ మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి స్టేజీ వరకు రూ. 5, రెండో స్టేజీ నుంచి రూ. 10 చొప్పున పెరుగుతుంది. ఈ పెంపు వల్ల ఆర్టీసీకి నిత్యం రూ. 20 లక్షల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. 

డీజిల్‌ బస్సుల స్థానంలో విద్యుత్‌ బస్సుల కోసం.. 
హైదరాబాద్‌లో డీజిల్‌ బస్సుల వల్ల వాతావారణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్‌ బస్సులను వాడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో నిర్ణయించారు. ప్రస్తుతం తిరుగుతున్న 2,800 డీజిల్‌ బస్సులను ఔటర్‌ రింగ్‌రోడ్డు అవతల ఉన్న డిపోలకు తరలించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులను తిప్పాలని ఆదేశించారు. ఇందుకోసం ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం ఈ–డ్రైవ్‌ కింద దరఖాస్తు చేసుకోగా కేంద్రం సానుకూలంగా స్పందించి బస్సులను మంజూరు చేసింది. 

హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ సహా మొత్తం 11 నగరాలకు బస్సుల సరఫరాకు టెండర్లు పిలిచింది. ఎంపికైన ప్రైవేటు సంస్థకు కేంద్రం రాయితీ అందిస్తుంది. ఆ సంస్థ బస్సులను సమకూర్చుకొని ఆరీ్టసీకి అద్దెకిస్తుంది. ‘ఫేమ్‌’పథకం కింద గతంలో హైదరాబాద్‌కు 500 ఎలక్ట్రిక్‌ బస్సులు మంజూరయ్యాయి. వాటిల్లో 225 బస్సులు ఇప్పటికే సమకూరగా మరో రెండు నెలల్లో మిగతావి అందనున్నాయి. పీఎం ఈ–డ్రైవ్‌ కింద వచ్చే బస్సులతో కలిపి అప్పుడు మొత్తం 3,300 విద్యుత్‌ బస్సులు నగర రోడ్లపైకి వస్తాయి. 



ప్రభుత్వం ఆదుకోకపోవడంతో.. 
ప్రస్తుతం నగరంలో 25 బస్సు డిపోలున్నాయి. ఎలక్ట్రిక్‌ బస్సులకు పవర్‌ చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున అందుకు కొంత స్థలం అవసరమవుతుంది. ప్రస్తుతం డీజిల్‌ బస్సుల తరహాలో ఒక్కో డిపోలో 100 అంతకుమించి బస్సులకు స్థలం సరిపోదు. 3,300 బస్సులకు సరిపోవాలంటే అదనంగా మరో 10 కొత్త డిపోలను, ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఒక్కో డిపోపై రూ. 7–8 కోట్ల భారం పడనుంది. ఇంటర్‌మీడియట్‌ స్టేషన్ల ఏర్పాటుకు మరో రూ. 6 కోట్లు ఖర్చవుతుంది. 

ఇప్పటికే కొన్ని డిపోలకు ఏర్పాటు చేయగా, మరో 19 డిపోలకు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్తగా ప్రతిపాదించిన 10 డిపోలతో కలిపి ఇప్పుడు 29 డిపోలకు ఈ వ్యవస్థ ఏర్పాటు కావాలి. ఇందుకు రూ. 392 కోట్లు అవసరమవుతుందని ఆర్టీసీ అంచనా వేసింది. ఈ మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదించగా ప్రభుత్వం చేతెలెత్తేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సిటీ బస్సుల ప్రయాణికులపై చార్జీల భారం మోపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. బస్సు చార్జీలను సవరించడం ద్వారా వచ్చే రెండేళ్లలో ఆ మొత్తాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది.   

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)