Breaking News

‘ఆయుష్మాన్‌’ అమలుకు సిద్ధం

Published on Mon, 09/23/2024 - 04:31

సాక్షి, హైదరాబాద్‌: డెబ్భై ఏళ్లు ఆపైబడిన వారందరికీ పేద, ధనిక తేడా లేకుండా ఉచిత వైద్యం అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు తెలంగాణలో రంగం సిద్ధమైంది. ఆ వయస్సు వారు తెలంగాణలో దాదాపు 5 లక్షల మంది ఉంటారని రాష్ట్ర వైద్య ఆరోగ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉచిత వైద్యం అందించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్‌ కార్డులు అందజేస్తారు.

ఆధార్‌ కార్డును ఆధారం చేసుకుని వయస్సును లెక్కించి కార్డులు ఇస్తారు. అలా కార్డులు పొందినవారు ఏదైనా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరితే రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌కు పథకాల పేర్లలో తేడాలు ఉన్నా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందించడమే రెండింటి ప్రధాన ఉద్దేశమని అంటున్నారు. ఆరోగ్యశ్రీలో 77.19 లక్షల కుటుంబాలకు వైద్యం అందుతోంది.

ఇందుకు ఏటా సగటున రూ.700 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేస్తే, దీనికింద కవర్‌ అయ్యే 26.11 లక్షల కుటుంబాల కోసం సుమారు రూ.200 కోట్ల వరకూ కేంద్రమే భరిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా 5 లక్షల మంది 70 ఏళ్లు పైబడిన వారికి కూడా వైద్యం అందితే అందుకు అవసరమైన నిధులను కేంద్రమే భరిస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు.  

కలిపి అమలు చేయాలి 
ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 972 రకాల వ్యాధులకు చికిత్స అందుతుండగా, ఆయుష్మాన్‌ భారత్‌లో 1,350 చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్‌లోలేని 540 వ్యాధులు ఆరోగ్యశ్రీలో ఉండగా, ఆరోగ్యశ్రీలో లేని 685 వ్యాధులు ఆయుష్మాన్‌లో ఉన్నాయి. దీంతో ఈ రెండింటినీ కలిపి అమలు చేయాలని వైద్య వర్గాలు అంటున్నాయి. ఉదాహరణకు డెంగీ, మలేరియా వంటి వాటికి ఆరోగ్యశ్రీ వర్తించదు. కానీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం వాటికి వర్తిస్తుంది.

కిడ్నీ, లివర్‌ మారి్పడులు ఆరోగ్యశ్రీలో ఉండగా... ఆయుష్మాన్‌లో లేవు. ఈ రెండు స్కీంలు కలిపితే అన్ని చికిత్సలు ఒకే గొడుగు కిందకి వస్తాయి. ఈ రెండు పథకాల ద్వారా రాష్ట్రంలో అర్హులైన వారికి 1,887 రకాల చికిత్సలకు ఉచిత వైద్యం లభిస్తుంది. ఆయుష్మాన్‌లో చికిత్సల ప్యాకేజీల ధరలు, ఆరోగ్యశ్రీ ప్యాకేజీల కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు కొన్ని ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)