Breaking News

చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు మంజూరు

Published on Wed, 07/02/2025 - 06:10

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం’కింద రూ.33 కోట్లు మంజూరు చేస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ తరఫున ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2025–26 బడ్జెట్‌ నిధుల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నారు. చేనేత కార్మికులపై ఉన్న అప్పులను తీర్చేందుకు ఈ నిధులను వినియోగిస్తారు. హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్, అప్పారెల్‌ ఎక్స్‌పోర్ట్‌ పార్క్స్‌ కమిషనర్‌కు ఈ నిధులను విడుదల చేసి, లబ్ధిదారులకు చెల్లించేందుకు పూర్తి అధికారం ఇచ్చారు.

రూ.33 కోట్లను చేనేత కార్మికులకు రుణమాఫీగా చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్థికశాఖ ఇచ్చిన అనుమతితో 2025 జూన్‌ 24న విడుదలైన నోటు ఆధారంగా ఈ ఆదేశాలు జారీ అయినట్టు తెలిపారు. ఈ నిర్ణయం చేతివృత్తులను ఆధారంగా చేసుకొని జీవిస్తున్న వేలాది చేనేత కార్మికులకు పెద్ద ఊరటగా నిలుస్తుందని, వడ్డీల భారంతో సతమతమవుతున్న నేతన్నలకు ఇది ఊరట కలిగించే నిర్ణయమని ప్రభుత్వం పేర్కొంది. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)