Breaking News

2 నెలల్లో రూ.26 కోట్ల డ్రగ్స్‌ సీజ్‌ 

Published on Fri, 08/25/2023 - 05:46

సాక్షి, హైదరాబాద్‌: నిషా ముక్త్‌ తెలంగాణ లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌) అద్భుత ఫలితాలు సాధిస్తోందని న్యాబ్‌ డైరెక్టర్, నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. జూన్‌–జూలై నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చేసిన దాడుల్లో టీఎస్‌ న్యాబ్‌ అధికారులు 196 కేసులు నమోదు చేసినట్లు గురువా రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.


కాగా 196 కేసుల్లో 175 గంజాయి దందాకు సంబంధించినవే. ఈ కేసుల్లో అధికారులు 353 మందిని అరెస్టు చేశారు. మరోపక్క 21 డ్రగ్స్‌ సంబంధిత కేసుల్లో 46 మందిని కటకటాల్లోకి పంపారు. వీరి వద్ద నుంచి స్వాదీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ రూ.26,01,34,650గా నిర్థారించారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు జూన్‌లో మూడు రోజుల పాటు మిషన్‌ పరివర్తన్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

డ్రగ్‌ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ఇతర రాష్ట్రాల, కేంద్ర ఏజెన్సీల సహకారం తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన కీలక సమావేశం గత నెల 5న నిర్వహించారు. డ్రగ్స్‌ దందాకు చెక్‌ చెప్పడానికి డార్క్‌వెబ్‌ సహా ఆన్‌లైన్‌లో జరిగే అక్రమ లావాదేవీలు నిరోధించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని నిర్ణయించారు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)