Breaking News

కూలీకి రూ.22 లక్షల జీఎస్టీ నోటీసు!

Published on Fri, 03/14/2025 - 04:39

చండ్రుగొండ: ఓ సాధారణ వ్యవసాయ కూలీకి రూ.22 లక్షలు జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు జారీ అయింది. ఇటీవల పోస్టు ద్వారా అందిన నోటీసుతో నిరక్షరాస్యుడైన ఆ కూలీ బిత్తరపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండకు చెందిన జానపాటి వెంకటేశ్వర్లు (వెంకటేష్‌) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు ఈ నెల 4వ తేదీన జీఎస్టీ నోటీసు అందింది. తనకు చదువు రాకపోవటంతో తెలిసివారికి ఆ లేఖను చూపగా, విజయవాడ బెంజ్‌ సెంటర్‌లోని కమర్షియల్‌ ట్యాక్స్‌ కార్యాలయం నుంచి అందిన నోటీసుగా చెప్పారు.

విజయలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో రూ.కోటి విలువైన గ్రానైట్‌ వ్యాపారం చేశారని, 2022 ఏడాదిలో చేసిన ఈ వ్యాపారానికి జరిమానాతో కలిపి జీఎస్టీ రూ.22,86,014 బకాయి పడ్డట్లు అందులో ఉంది. దీంతో ఆందోళన చెందిన వెంకటేశ్వర్లు.. విజయలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌ ఎవరిదో కనుక్కునేందుకు ఈ నెల 12న విజయవాడ వెళ్లాడు. అయితే ఆ అడ్రస్‌లో కార్యాలయమే లేదని తేలడంతో వెనుదిరిగాడు. 2022 ఏడాదిలో ఆయనకు పాన్‌కార్డు కూడా లేదు.

ఆరు నెలల క్రితమే చండ్రుగొండలోని మీ సేవ కేంద్రానికి పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేయటానికి వెళ్తే.. ఆ పేరు, ఆధార్‌ నంబర్‌తో అప్పటికే పాన్‌కార్డు జారీ అయిందని చెప్పారు. అయితే, వెంకటేశ్వర్లు ఆధార్‌కార్డు అక్రమార్కుల చేతికి ఎలా వెళ్లింది? ఆయన పేరుతో వ్యాపార లైసెన్స్‌ తీసుకున్నది ఎవరేది తేలాల్సి ఉంది. ఈ విషయమై బాధితుడు మాట్లాడుతూ రెక్కాడితే కాని డొక్కాడని తనకు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదని, అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)