Breaking News

‘సాక్షి’ ఎడిటర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి

Published on Fri, 09/19/2025 - 05:09

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘సాక్షి’ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్‌) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో గురువారం జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ‘సాక్షి’ఎడిటర్‌తో పాటు ఖమ్మంలో టీన్యూస్‌ ప్రతినిధి సాంబశివరావు, ఆ మీడియా సిబ్బందిపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వాలు వెంటనే ఎత్తివేయాలని నాయకులు డిమాండ్‌ చేయగా.. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేతలు సంఘీభావం తెలిపారు.

బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, ప్రజాసంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియాను నిర్బంధాలతో లోబర్చుకోవాలనే ఆలోచనను ప్రభుత్వాలు మానుకోవాలని హెచ్చరించారు. సీపీఐ నేత హేమంతరావు, మాస్‌లైన్‌ నేత పోటు రంగారావు, సీపీఎం నేత కల్యాణం వెంకటేశ్వరరావు, న్యూడెమోక్రసీ నాయకుడు మోహన్‌రావు, బీఆర్‌ఎస్‌ నేత పగడాల నాగరాజు, ఐజేయూ నేతలు రాంనారాయణ, వెంకటేశ్వరరావు, టీజేఎఫ్‌ నేత ఆదినారాయణ, జేఏసీ చైర్మన్‌ తిరుమలరావు తదితరులు భేటీలో పాల్గొన్నారు. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు