2030-35 నాటికి విస్తృతంగా పొలాల్లో రోబోలు

Published on Sat, 12/20/2025 - 05:02

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2030-35 నాటికి రైతుల పొలాల్లో రోబోలు, డ్రోన్లు, మానవరహిత ట్రా­క్టర్లు, సెన్సర్ల వినియోగం విస్తృతం కానుందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ­విద్యాలయ ఉప­కులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య అన్నారు. అందుకు అవసరమైన పరిశోధనలు వర్సిటీల్లో కొనసాగుతున్నాయని తెలి­పారు. మానవరహిత వ్యవసాయ సాధన దిశగా తమ వర్సిటీ కీలక ముందడుగు వేసిందన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆర్థిక సహకారంతో విశ్వవిద్యాల­యంలో ఏర్పాటు చేసిన తొలిదశ అగ్రి రొబోటిక్స్‌ ప్రయోగశాలను ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు­శెట్టితో కలిసి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య శుక్రవారం ప్రా­రంభించా­రు. దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయా­ల్లో అత్యాధు­నిక అగ్రి రొబోటిక్స్‌ ల్యాబ్‌ ఏర్పాటవడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీని­వా­సులుశెట్టి మాట్లాడుతూ వర్సిటీ పూర్వ విద్యార్థిగా ఇలాంటి ఆధునిక ప్రయోగశాల ప్రారంభంలో భాగస్వామిగా ఉండ­టం సంతో­షంగా ఉందన్నారు. సుమారు ఏడాది క్రితం ప్ర­యోగశాల ప్రతిపాదనను వీసీ అల్దాస్‌ జానయ్య, నాటి డీన్‌ జెల్లా సత్య­నారాయణ తన దృష్టికి తీసుకొచ్చారని చె­ప్పా­రు. ఏడాది­లోనే ప్రయోగశాల ప్రతిపాదన కార్యరూపం దాల్చి తొలిదశ ల్యాబ్‌ ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లు, రోబోలు భవిష్యత్తు­లో వ్యవసాయ రంగం వైపు యువతను ఆకర్షించడంలో కీలకంగా మారతాయని శ్రీనివాసులుశెట్టి అభిప్రాయపడ్డారు. 

వికసిత్, రైజింగ్‌ లక్ష్యాల సాధనలో..
ఉపకులపతి అల్దాస్‌ జానయ్య మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్‌ భారత్, తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాల సాధనలో వ్యవ­సాయ, గ్రామీణ రంగాలు కీలకపాత్ర పోషించనున్నాయని తెలిపారు. భవిష్యత్తు వ్యవసాయం ఏఐ ఆధారిత పరిజ్ఞా­నం­పైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఆ దిశగా మానవ­రహి­త వ్యవసాయ సాధనలో భాగంగా అగ్రి రొబోటిక్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో అగ్రిహబ్‌ ఎండీ డాక్టర్‌ జి. వెంక­టేశ్వర్లు, అగ్రి రొబోటిక్స్‌ ల్యాబ్‌ ప్రాజెక్టు హెడ్‌ డాక్టర్‌ జెల్లా సత్యనారాయణ, వర్సిటీ అధికారులు, ఎస్‌బీఐ సీనియర్‌ అధికారులు, ఫౌండేషన్‌ ప్రతినిధులు, విద్యార్థులు, శాస్త్ర­వేత్తలు పాల్గొన్నారు.

Videos

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)