Breaking News

పట్టాలైనా.. పక్కా రోడ్లయినా..

Published on Fri, 03/14/2025 - 09:39

ఖమ్మం రాపర్తినగర్‌/చింతకాని: పట్టాలు ఉన్నంత వరకు రైలు చక్రాలకు ఉండే యాక్సిల్‌తో.. పట్టాలు ముగియగానే సాధారణ టైర్లతో రోడ్డుపైనా పరుగులు తీయగల వాహనాన్ని రైల్వే అధికారులు వినియోగిస్తున్నారు. పట్టాలపై పగుళ్లను గుర్తించేందుకు యూఎఫ్‌ఎస్‌డీ యంత్రాన్ని అమర్చిన కారులో అధికారులు మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నుంచి ఖమ్మం జిల్లా పందిళ్లపల్లి రైల్వేస్టేషన్‌ వరకు గురువారం పరిశీలించారు.

 ఈ కారు రామకృష్ణాపురం రైల్వే గేట్‌ (107) వద్ద ఆగింది. అందులో ఉన్న ఎస్‌ఎస్‌ఈటీవే కృష్ణకుమార్‌ కిందకు దిగడంతో.. స్థానికులు ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గతంలో పట్టాలపై పగుళ్లను గుర్తించేందుకు సిబ్బంది కాలినడకన వెళ్లే వారని తెలిపారు.

 ప్రస్తుతం ప్రత్యేక యంత్రం అమర్చిన ఈ కారుకు రైలు చక్రాలకు ఉండే యాక్సిల్‌ ఉండటంతో పట్టాలపై వెళ్తుందని ఎస్‌ఎస్‌ఈటీవే కృష్ణకుమార్‌ వివరించారు. పట్టాలపై వెళ్లేటప్పుడు యాక్సిల్‌ కిందకు వచ్చి వాహనం కాస్త పైకి లేస్తుందని చెప్పారు. మళ్లీ కిందకు దింపితే రోడ్డుపై సాధారణ టైర్లతో వెళ్లొచ్చని వివరించారు.  

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)