Breaking News

ప్రభుత్వ లాంఛనాలతో నేడు అగర్వాల్‌ అంత్యక్రియలు

Published on Sat, 08/17/2024 - 05:38

సాక్షి, హైదరాబాద్‌/సంతోష్‌నగర్‌: అగ్ని క్షిపణి మిషన్‌ తొలి ప్రోగ్రామ్‌ డైరెక్టర్, దిగ్గజ శాస్త్రవేత్త డాక్టర్‌ రామ్‌ నరైన్‌ అగర్వాల్‌ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. గురువారం కన్ను మూసిన అగర్వాల్‌ అంత్యక్రియలు శనివారం జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం.. అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది.

1983లో భారత ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక క్షిపణి తయారీ కార్యక్రమంలో డాక్టర్‌ అరుణాచలం, డాక్టర్‌ అబ్దుల్‌ కలాంతో కలసి అగర్వాల్‌ పనిచేశారు.  అగర్వాల్‌ హైదరాబాద్‌లోనే నివాసం ఏర్పరచుకొని చివరి వరకు రక్షణ రంగానికి సేవలందించారు. ఇదిలా ఉండగా డీఆర్‌డీఓ హైదరాబాద్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ అండ్‌ ఆర్‌అండ్‌డీలో ఉద్యోగులు శుక్రవారం అగర్వాల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ ఇంజనీర్‌ అండ్‌ ఎస్టేట్‌ మేనే జర్‌ షేక్‌ గౌస్‌ మోహినుద్దీన్‌ పాల్గొన్నారు. 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)