Breaking News

అమ్మా.. నీ తప్పుకు నన్ను చంపేశావా?

Published on Wed, 03/12/2025 - 10:37

‘అమ్మా.. ఇంకో మూడు నెలలైతే లోకం చూసేవాడిని కదమ్మా.. ఎందుకమ్మ ఇంత పనిచేశావు. నీ కడుపులో నన్ము మోయలేకపోయావా.. ఆరు నెలలుగా నీ కడుపులో హాయిగా పెరుగుతున్నా.. నీవు మింగిన మాత్రలకు నాకు ఊపిరి ఆడడం లేదమ్మా.. లోకం చూపించి అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది.. తెల్లవారేసరికే నా ఊపిరి తీశావేంటమ్మా.. నీవు చేసిన తప్పుకు నన్ను బలి ఇచ్చావా..’

ఆదిలాబాద్‌ జిల్లా: ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలంలోని గురుజ వాగులో పడేసిన పిండానికి మాటలు వస్తే ఇలాగే ప్రశ్నించేదేమో. క్షణికావేశంలో చేసిన తప్పుకు గర్భం దాల్చిన ఓ యువతి.. బయటి ప్రపంచానికి ఆ విషయం తెలియకుండా ఉండేందుకు ఆరు నెలల గర్భంలోనే పిండాన్ని చంపేశారు. ఈ హృదయ విదారక సంఘటన గురుజ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... 

మంగళవారం ఉదయం గ్రామ శివారులోని వాగు ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లిన కొందరు గ్రామస్తులకు మృత శిశువు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై మహేందర్‌ సంఘటనా స్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. స్థానికులు అందించిన వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువతి, ఇద్దరు యువకులతోపాటు ఆర్‌ఎంపీని అదుపులోని తీసుకున్నట్లు తెలిసింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఓ యువతి.. ఆరు నెలల గర్భాన్ని తీయించుకునేందుకు ఆర్‌ఎంపీని ఆశ్రయించినట్లు సమాచారం. 

మంగళవారం రాత్రి గ్రామంలో తిరిగిన సదరు ఆర్‌ఎంపీ ప్రాణాపాయమని తెలిసినా.. ఆరు నెలల గర్భాన్ని తొలగించారు. ఆ పిండాన్ని ఇలా వాగులో పడేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు పూర్తి కానందున పూర్తి వివరాలు బుధవారం అందిస్తామని సీఐ భీమేష్‌ తెలిపారు. మృత శిశువును పరీక్షించిన వైద్యులు మగ శిశువుగా నిర్ధారించారు. పిండం వయస్సు సుమారు 6 నెలలు దాటి ఉండవచ్చని సమాచారం.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)