Breaking News

మన పులులు 21

Published on Sun, 07/30/2023 - 02:23

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 21 పెద్ద పులులు ఉన్నట్టు ’స్టేటస్‌ ఆఫ్‌ టైగర్స్‌ 2022’నివేదిక వెల్లడించింది. ఈ మేరకు శనివారం కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అధికారిక నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పులులు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లోనే ఉన్నాయని, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఒక్క పులి కూడా శాశ్వత ఆవాసం ఏర్పరచుకోలేదని పేర్కొంది.

కాగా ఈ నివేదిక చూస్తుంటే కేవలం రెండు టైగర్‌ రిజర్వ్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పులుల సంఖ్యనే గుర్తించినట్టు కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ నివేదికలో రెండున్నరేళ్ల వయసుకు పైబడిన పులుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోందన్నారు. మొత్తంగా సవివరమైన వివరాలతో విడుదల చేసే ‘అబ్‌స్ట్రాక్ట్‌ నివేదిక’లో స్పష్టత వస్తుందనీ అది వచ్చేందుకు కొంత సమయం పట్టొచ్చునని పేర్కొంటున్నారు. 

తాజా నివేదికపై అధికారుల్లో చర్చ 
2018లో ఉన్న 26 పులుల సంఖ్య (కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో 19, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో 7) నుంచి ఇప్పుడు గణనీయంగా పులుల సంఖ్య పెరిగి ఉంటుందని అధికారులు భావిస్తూ వచ్చారు. అయితే నివేదిక అందుకు భిన్నంగా రావడంపై రాష్ట్ర అటవీశాఖ అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రంలోని రెండు పులుల అభయారణ్యాల్లోనే కాకుండా టైగర్‌ కారిడార్లు, బఫర్‌ జోన్లు ఇతర ప్రాంతాలు కలిపితే 28 దాకా పెద్ద పులులు, దాదాపు పది దాకా పులి పిల్లలు ఉండొచ్చునని అటవీ అధికారులు చెబుతున్నారు.

కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం వంటి కొత్త ప్రాంతాల్లో పులి పాదముద్రలు రికార్డ్‌ అయ్యాయని, టైగర్‌ కారిడార్‌ ఏరియాలోని సిర్పూర్‌ కాగజ్‌నగర్, ఇతర ప్రాంతాల్లోనూ వీటి జాడలున్నాయని తెలిపారు. అక్కడ పులుల సంఖ్యలో వృద్ధికి సంబంధించి తాము క్షేత్రస్థాయిలో కెమెరా ట్రాపులు, ఫొటోలు, ఇతర సాంకేతిక ఆధారాలతో ఈ అంచనాకు  వచి్చనట్టుగా ఒక సీనియర్‌ అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. 

ప్రాజెక్ట్‌ టైగర్‌ ద్వారా సత్ఫలితాలు 

  • అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్‌ఎం డోబ్రియాల్‌ 
  • ములుగులో ఘనంగా రాష్ట్ర స్థాయి పులుల దినోత్సవం 

ములుగు (గజ్వేల్‌): దేశవ్యాప్తంగా పులుల సంఖ్య పెంపుదల కోసం చేపట్టిన ప్రాజెక్ట్‌ టైగర్‌ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌)ఆర్‌.ఎం. డోబ్రియాల్‌ తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం (ఎఫ్‌సీఆర్‌ఐ)లో ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

దేశంలో పులుల సంఖ్య 3,167కు పెరిందని తెలిపారు. అమ్రాబాద్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంరక్షణ చర్యలతో ఇక్కడ కూడా పులుల సంఖ్య పెరిగిందన్నారు. పులులను మనం కాపాడితే అడవిని, తద్వారా మానవాళిని కాపాడుతాయన్నారు. రానున్న రోజులలో పులుల ఆవాసాలను మరింతగా అభివృద్ధి చేస్తామని వివరించారు. ములుగు ఎఫ్‌సీఆర్‌ఐ డీన్, సీఎం కార్యాలయ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)