Breaking News

ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయాలి

Published on Mon, 06/17/2024 - 05:38

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని, తక్షణమే కౌన్సెలింగ్‌ పద్ధతిలో ఉద్యోగుల సాధారణ బదిలీలు నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం తీర్మానించింది. ఆదివారం నాంపల్లిలోని గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ భవన్‌లో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎ.సత్యనారాయణ ఈ సమావేశాన్ని ప్రారంభించి ఉద్యోగుల సమస్యలు, సరీ్వసు అంశాలపై చర్చించారు.

అనంతరం 17 అంశాలతో కూడిన తీర్మాన ప్రతిని ప్రవేశపెట్టగా కేంద్ర సంఘం కార్యవర్గంతో పాటు 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగుల ఫోరం, 54 శాఖల ఫోరమ్‌లు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. జిల్లాల వారీగా, శాఖ ల వారీగా టీజీఓ ఫోరమ్‌ల ఏర్పాటుకు కేంద్ర సంఘం ఆమోదం తెలిపింది. ఈ తీర్మాన ప్రతిని మంత్రివర్గ ఉపసంఘానికి, త్రిసభ్య కమిటీకి అందించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు వెల్లడించారు. సమావేశంలో టీజీఓ కేంద్ర సంఘం అసోసియేట్‌ అధ్యక్షుడు బి.శ్యామ్, ఉపాధ్యక్షుడు ఎ.జగన్మోహన్‌రావు, కోశాధికారి ఎం.ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

తీర్మానంలోని ప్రధాన అంశాలు 
⇒ ఉద్యోగుల బదిలీలపై బ్యాన్‌ ఎత్తివేసి కౌన్సెలింగ్‌ పద్ధతిన తక్షణమే నిర్వహించాలి 
⇒ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 4 డీఏ బకాయి లను చెల్లించాలి. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి 
⇒ ఆర్థిక శాఖలో పెండింగ్‌లోని సప్లిమెంటరీ బిల్లులన్నీ క్లియర్‌ చేయాలి 
⇒  జీఓ 317 దరఖాస్తులన్నీంటినీ పరిష్కరించాలి 
⇒  2వ పీఆర్సీ మధ్యంతర భృతి 5% నుంచి 20% పెంచాలి 
⇒ వైద్య,ఆరోగ్య శాఖలో జీఓ 142ను çసమీక్షించాలి 
⇒  కొత్త జిల్లాల్లో అదనపు కేడర్‌ స్ట్రెంథ్‌ మంజూరు చేయాలి 
⇒  అధికారులపై అనుచితంగా ప్రవర్తిస్తున్న జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలి. 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి