Breaking News

భద్రాద్రి: వరద నీటిలో 30 మంది కూలీలు.. హెలికాప్టర్‌ సాయంతో..

Published on Thu, 07/18/2024 - 18:47

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దండికొడుతున్నాయి. భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, తాజాగా భద్రాద్రి జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తడంతో నీటిలో 30 మంది కూలీలు చిక్కుకున్నారు. వారిని హెలికాప్టర్‌ సాయంతో రక్షించారు.

కాగా, భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం అధికారులు ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తారు. దీంతో ప్రాజెక్టు దిగువ భాగంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయింది. ఈ ​‍క్రమంలో భద్రాద్రి కొత్తగూడెంలోని నారాయణపురం వద్ద 30 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు.

వారంతా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్‌లో ఈ విషయం చెప్పడంతో అధికారులు రంగంలోకి దిగారు. బాధితులను రక్షించేందుకు సీఎంవోతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపారు. హెలికాప్టర్‌ ద్వారా బాధితుల్ని రక్షించాలని ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం, రెస్క్యూ టీమ్‌ సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో, ఘటన స్థలానికి హెలికాప్టర్‌ చేరుకుని వారిని రక్షించారు.

మరోవైపు.. పెద్దవాగు వరద ఉధృతిపై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌, ఎస్పీలకు ఆయన ఫోన్‌ చేశారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరుగకుండా చూడాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)