Breaking News

‘రెస్క్యూ’ కొనసాగించాలా.. వద్దా?

Published on Thu, 04/24/2025 - 03:20

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో శిథిలాల కింద ఉన్న మిగతా కార్మికుల ఆచూకీ కోసం 60 రోజులుగా పనులు కొనసాగుతు­న్నా­యి. ఫిబ్రవరి 22న సొరంగం పైకప్పు కూలి ప్రమాదం చోటుచేసుకోగా, ఇప్పటివరకు ఇద్ద­రు కార్మికుల మృతదేహాలు లభించాయి. ఇంకా ఆరుగురు కార్మికుల ఆచూకీ కోసం నిరాటంకంగా పనులు కొనసాగుతున్నాయి. 

12 సంస్థ­లకు చెందిన 560 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో తవ్వకాలను కొనసాగిస్తున్నారు. సొరంగం­లోని ప్రమాదస్థలంలో డీ2 పాయింట్‌ వద్ద రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప కంచె వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. అక్కడి నుంచి ఇంకా ముందుకు పనులు కొనసాగించాలా లేక నిలిపివేయాలా అన్న దానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక నిపుణుల కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. 

చివరి 43 మీటర్లలోనే.. 
14 కి.మీ. లోపల సొరంగం చివరన 43 మీట­ర్లు ప్రమాదకరంగా ఉండటంతో డీ2 పాయింట్‌ వద్ద ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. అక్క­డి మట్టిని తొలగిస్తే మళ్లీ సొరంగం కూలిపో­యే అవకాశం ఉందని ఇప్పటికే జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఇనుప కంచె వరకు తవ్వకాలు పూర్తికాగా మిగతా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. వారు ఆ 43 మీటర్ల పరిధిలోనే కూరుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంకా పనులు కొనసాగించాలా, వద్దా? అన్న అంశాన్ని తేల్చేందుకు ప్రభుత్వం సాంకేతిక ని­పుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. 

ఇందులో ఎన్డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్, ఎన్జీఆర్‌ఐ డైరెక్టర్, జీఎస్‌ఐ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్, మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ డైరెక్టర్, బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా, అటవీశాఖ పీసీసీఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌కు చెందిన అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్, నీటిపారుదల శాఖ సీఈ, నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎస్‌­ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌ సీఈతో కూడిన 12 మంది స­భ్యులు ఉన్నారు. చివరి 43 మీటర్లలో పనులు చేపడితే రెస్క్యూ బృందాలకు సైతం అపాయ­మున్న నేపథ్యంలో పనులు నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)