Breaking News

రాముడు నడయాడిన రామగిరి ఖిల్లా

Published on Sun, 07/27/2025 - 05:00

రామగిరి(మంథని): రాముడు నడయాడిన నేలగా రామగిరి ఖిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఒకప్పుడు నక్సలైట్లకు ఆవాసంగా ఉండేది. అలనాటి చారిత్రక కట్టడాలు, ఆయుర్వేద వనమూలికల భాండాగారంగా ప్రసిద్ధి చెందింది. విభిన్న జాతుల వృక్షాలతో.. ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకుంటోంది. అద్భుత కళాసంపదకు నిలయమైన రామగిరి ఖిల్లా.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామం నుంచి కల్వచర్ల గ్రామం వరకు విస్తరించి ఉంది. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి తపస్సు చేసి శివలింగం ప్రతిష్టించినట్లు కథనం ప్రచారంలో ఉంది. 

వనవాసం సమయంలో కొద్ది రోజులు కుటీరం ఏర్పరచుకొని సీతాలక్ష్మణులతో ఉన్నారని, ఖిల్లాపై సీతారామలక్ష్మణులు సంచరించినట్లు కొన్ని ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తాయి. ఖిల్లా బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతో పాటు ఆంజనేయుని విగ్రహాలు ఉన్నాయి. ఏటా శ్రావణమాసంలో కోటపై సీతాసమేత శ్రీరాముడు, హనుమాన్‌ విగ్రహల ఊరేగింపు నిర్వహించి పూజలు చేస్తారు.

 

చూడాల్సిన ప్రదేశాలు 
ఖిల్లాలో ఏడు కోట ప్రవేశ దర్వాజాలు, 15 ఎత్తయిన శత్రు సైన్యాన్ని పసిగట్టే బురుజులున్నాయి. మొదటి దర్వాజాకి కుడి వైపు వెళ్తే జలపాతం, రెండో దర్వాజా ప్రవేశంలో కుడివైపు గోడలపైన క్రీ.శ.1556 కాలం నాటి పది పంక్తులున్న తెలుగు శాసనం కనిపిస్తాయి. దర్వాజా ప్రవేశించిన తర్వాత ఎడమవైపు అద్భుతమైన పచ్చని కోట, 25 మీటర్ల పొడవున్న అతిపెద్ద ఫిరంగి, నాలుగో దర్వాజాపై అతిపెద్ద ఫిరంగితో పాటు ఏనుగుతో పోరాడుతున్న యోధుడి శిల్పం, రెండు తలల గరుత్మంతుడి శిల్పం ఉంటాయి.

 పదిహేను మీటర్ల పొడవున్న పిల్లల ఫిరంగి ఉంటుంది. ఆరో దర్వాజా నుంచి 21 మెట్లు ఎక్కితే కోటపై నుంచి మానేరువాగు వయ్యారాలతో పాటు ఖిల్లాపై వివిధ చారిత్రక స్థలాలైన సీతమ్మ స్నానమాడిన కొలను, పసరు బావులు, పసుపు, కుంకుమ భరణి, సవతుల బావులు, మాధవీ మండపం, రాముడు ప్రతిష్టించిన శివలింగాలు, హనుమంతుడి విగ్రహం, చరశాలలు, గజశాలలు, అశ్వశాలలు, రాజమందిరానికి రాతి నీటి గొట్టాలు, చివరగా సీతారాముల వారిని దర్శించుకోవచ్చు. 

శ్రావణమాసంలో సందడి  
ప్రతి శ్రావణమాసంలో రామగిరి ఖిల్లాపై పర్యాటకుల సందడి ఉంటుంది. ఈ దుర్గంపై నుంచి ప్రకృతి అందచందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరిచిపోతారు. ఆయుర్వేద వైద్యులు ఈ ఖిల్లాపై వనమూలికలను సేకరిస్తారు. పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని గతంలో ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. ప్రాచీన కళలకు నిలయమైన రామగిరిఖిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి పనులు నిర్వహిస్తే పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందుతుంది. 

ఖిల్లాకు వెళ్లే దారి 
పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి మంథని ప్రధాన రహదారిలో సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి బేగంపేట ఎక్స్‌రోడ్‌ (నాగెపల్లి) వద్ద దిగాలి. ఆటోద్వారా బేగంపేట గ్రామానికి చేరుకుని సుమారు 3 కిలోమీటర్లు కాలినడకన ఖిల్లాకు చేరుకోవచ్చు. ఖిల్లాకు ఉదయం 8 గంటల వరకు వెళ్తే.. సాయంత్రం 5 గంటల వరకు అన్ని ప్రదేశాలు చూడవచ్చు.   

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)