Breaking News

గద్దర్‌కు ఎన్నో ఆహ్వానాలు.. అయినా విమానం ఎక్కలేదు, విదేశాలకు పోలేదు 

Published on Mon, 08/07/2023 - 08:02

మంచిర్యాలఅర్బన్‌: గద్దర్‌ గళం..దేశవిదేశాల్లో ఎందరో అభిమానాన్ని చూరగొన్నది. ఆయన పాట వినేందుకు విదేశాల నుంచి అభ్యుదయ, సాంస్కృతిక సంఘాల నుంచి ఆహ్వానం వచ్చినా విమానం ఎక్కి వెళ్లలేకపోయారు. 1997, ఏప్రిల్‌ 6న ఆయనపై కాల్పులు జరగ్గా, ఆరు బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. ఐదు బుల్లెట్లను తొలగించిన వైద్యులు, వెన్నుపూసలో ఉన్న మరో బుల్లెట్‌ తొలగిస్తే ప్రాణానికే హాని ఉంటుందని చెప్పారు.

దీంతో అప్పటి నుంచి ఆ బుల్లెట్‌ శరీరంలోనే ఉండిపోయింది. దేశంలో ఇతర రాష్ట్రాల పర్యటనకు ఎయిర్‌పోర్ట్‌కు గద్దర్‌ వెళ్లినా, తనిఖీల్లో స్కానర్‌లో బుల్లెట్‌ చూపడం, అధికారులకు సమాధానం చెప్పడంలో అనేకసార్లు ఇబ్బంది పడినట్టు తెలిసింది. శరీరంలో బుల్లెట్, కేసులు పాస్‌పోర్టు జారీకి అడ్డంకిగా మారాయి. దీంతో ఎన్ని ఆహా్వనాలు వచ్చినా విమానం ఎక్కి విదేశాలకు వెళ్లలేకపోయారు.     

► 1980 సమయంలో నక్సల్స్‌తో కలసి అజ్ఞాతంలోకి వెళ్లారు. 
► పీపుల్స్‌వార్‌ పార్టీ నిర్ణయం మేరకు 1982లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలపు జననాట్యమండలి సభ్యుడిగా పనిచేశారు. 
► 1990 ఫిబ్రవరి 18న తిరిగి బహిరంగ జీవితంలోకి అడుగుపెట్టారు.  
► 1995లో పీపుల్స్‌వార్‌ పార్టీ గద్దర్‌ను బహిష్కరించింది. ఆయన తీవ్రంగా ఆవేదనకు గురవడంతో తిరిగి పార్టీలోకి ఆహా్వనించింది. 

25 ఏళ్లుగా వెన్నులో బుల్లెట్‌తో 
గద్దర్‌పై చాలా సార్లు హత్యాయత్నాలు జరిగాయి. నల్లదండు ముఠా, బ్లాక్‌ టైగర్స్, గ్రీన్‌ టైగర్స్‌ ముఠాలు ఆయనను చంపడానికి ప్రయత్నించాయి. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. గ్రీన్‌టైగర్స్‌ పేరుతో కొందరు ఆగంతకులు ఆయనపై కాల్పులు జరిపారు. ఆయన ప్రాణాలకు ప్రమాదమని ఒక బుల్లెట్‌ను వదిలేశారు. దీనితో దాదాపు 25 ఏళ్లుగా ఆ బుల్లెట్‌ గద్దర్‌ ఒంట్లోనే ఉండిపోయింది. 

‘‘రాష్ట్ర అణచివేతకు చిహ్నంగా నా వెన్నెముకలో బుల్లెట్‌ అలాగే ఉంది. దానితో నాకు భయమేమీ లేదు, ఏ ప్రభావమూ పడలేదు. నా లక్ష్యాలకు కట్టుబడి ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నా..పనిచేస్తూనే ఉంటా..’’ అని గద్దర్‌ తరచూ గుర్తు చేసుకునేవారు. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)