పెట్టుబడులు రూ.1.98 లక్షల కోట్లు..ఉద్యోగాలు 1.14 లక్షలు

Published on Mon, 01/06/2025 - 06:22

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సౌర, పవన, డిస్ట్రిబ్యూటెడ్‌ రెన్యూవబుఎల్‌ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజీ (బ్యాటరీ స్టోరేజీ+ పంప్డ్‌ స్టోరేజీ) ప్రాజెక్టులు, జియోథర్మల్, గ్రీన్‌ హైడ్రోజన్, హైబ్రిడ్‌ వంటి పునరుత్పాదక విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటును భారీ ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్‌ సరఫరా సామర్థ్యం (కాంట్రాక్టెడ్‌ కెపాసిటీ) 10,095.20 మెగావాట్లు ఉండగా, 2029–30 నాటికి సుమారు 20,000 మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని జత చేసి మొత్తం 31,400 మెగావాట్లకు పెంచాలని నిర్ణయించింది.

2034–35 నాటికి అదనంగా మరో 18,100 మెగావాట్ల సామర్థ్యాన్ని జత చేసి మొత్తం సామర్థ్యాన్ని 49,500 మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం వచ్చే పదేళ్లలో రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 1.14 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రెన్యూవబుల్‌ ఎనర్జీ పాలసీ–2025ని రాష్ట్ర మంత్రివర్గం శనివారం ఆమోదించింది. పదేళ్లపాటు ఈ పాలసీ అమల్లో ఉంటుంది.  

బిడ్డింగ్‌ ద్వారా డెవలపర్లకు ఆహ్వనం 
విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు టారిఫ్‌ ఆధారిత కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్లాంట్లు, పవన విద్యుత్‌ కేంద్రాలు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం, జియో థర్మల్, మినీ హైడల్, వేస్ట్‌ టూ ఎనర్జీ కేంద్రాల స్థాపనకు డెవలపర్ల నుంచి బిడ్లను ఆహ్వానించనున్నాయి. వీటిని గ్రిడ్‌కు అనుసంధానం చేసి, ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్‌ను కొనుగోలు చేయనున్నాయి.  

చౌకగా లీజుకు సర్కారీ భూములు.. 
డెవలపర్లకు ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు అద్దెతో లీజుకు ఇస్తారు. బిడ్డింగ్‌లో గెలిచిన సంస్థకు మార్కెట్‌ రేటులో 10 శాతం లీజు రేటుగా నిర్ణయిచి భూములను కేటాయిస్తారు. అనంతరం ప్రతి రెండేళ్లకోసారి 5 శాతం లీజు ధరను ప్రభుత్వం పెంచనుంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పంద (పీపీఏ) జరిగాక జిల్లా కలెక్టర్లతో లీజు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.  

కరెంటు ప్రైవేటుకూ అమ్ముకోవచ్చు 
డెవలపర్లు రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు సంస్థలకు ఓపెన్‌ యాక్సెస్‌ ద్వారా విద్యుత్‌ అమ్ముకోవచ్చు. సొంత అవసరాలకూ వాడుకోవచ్చు. ఎకరాకు రూ.లక్ష ధరతో ఇలాంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం 25 ఏళ్లు లేదా ప్రాజెక్టు జీవిత కాలానికి స్థలాలను కేటాయిస్తుంది.  

ముందు వచ్చిన వారికే ప్రాధాన్యత 
సబ్‌ స్టేషన్‌ పరిధిలో కొత్త విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఎంత సామర్థ్యం లభ్యత ఉందో.. ఆ మేరకు మాత్రమే అనుమతిస్తారు. ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత లభించనుంది. సౌర, పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్లాంట్లను రెండేళ్లలో, పవన విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.  

జలాశయాలపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టులు 
నీటిపారుదల శాఖ భాగస్వామ్యంతో జలాశయాలపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వీటి ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు జలాశయాలను నామినేషన్‌ విధానంలో కేటాయించనున్నారు.  

మహిళా సంఘాలతో సౌర విద్యుత్‌ కేంద్రాల స్థాపన 
500 కిలోవాట్‌ నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ ప్లాంట్ల స్థాపనకు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) నుంచి ఆసక్తి వ్యక్తీకరణను డిస్కంలు విడతలవారీగా ఆహ్వనించనున్నాయి. వారి నుంచి నిరీ్ణత ధరకు విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేస్తాయి.  

భారీ ప్రోత్సాహకాలు.. 
⇒  పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే భూములకు నాలా కన్వర్షన్‌ నుంచి మినహాయింపు.  
⇒ టీజీ–ఐపాస్‌ ద్వారా సింగిల్‌ విండో విధానంలో అన్ని అనుమతులను సత్వరం జారీ చేస్తారు.  
⇒ పారిశ్రామిక హోదా కల్పించి రాష్ట్ర పారిశ్రామిక విధానం కింద అందించే అన్ని రకాల ప్రోత్సాహకాలను వర్తింపుజేస్తారు.  
⇒ప్రతి మెగావాట్‌కు 4 ఎకరాలు చొప్పున భూగరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు కల్పిస్తారు.  
⇒ భూముల కొనుగోళ్లపై స్టాంప్‌ డ్యూటీ 100 శాతం తిరిగి చెల్లిస్తారు.  

⇒వేస్ట్‌ టు ఎనర్జీ ప్రాజెక్టులకు 100 శాతం రాష్ట్ర జీఎస్టీని తిరిగి చెల్లిస్తారు. 
⇒ కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు లోకల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ఫండ్‌ చెల్లింపుల నుంచి మినహాయింపు ఇస్తారు. ఇతర కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లుఅందుతాయి. జెన్‌కో, ట్రాన్స్‌కో సాంకేతిక సహకారం అందిస్తాయి.  
⇒ పీసీబీ నుంచి ఎన్‌ఓసీ మినహాయింపు.  
⇒ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సౌర, పవన విద్యుత్‌ వాడుకుంటే 8 ఏళ్ల పాటు విద్యుత్‌ సుంకం మినహాయింపు కల్పిస్తారు.  
⇒ పీఎస్పీ ప్రాజెక్టులకు నీటి సుంకాన్ని తిరిగి చెల్లిస్తారు.  

డిస్కంలకు విద్యుత్‌ విక్రయిస్తే ప్రత్యేక ప్రోత్సాహకాలు  
⇒ సూపర్‌వైజేషన్‌ చార్జీల మినహాయింపు. 
⇒ ఇతర సౌర, పంప్డ్‌ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ, ఇతర ప్రాజెక్టులకు 50 శాతం రాష్ట్ర జీఎస్టీని తిరిగి చెల్లిస్తారు. 
⇒ ఎస్‌హెచ్‌జీలు/గ్రామ సమాఖ్యలు ఏర్పాటు చేసే సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులతో పాటు వ్యక్తిగత గృహాలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ స్కూల్స్, కార్యాలయాలపై ఏర్పాటు చేసే రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రాజెక్టులకు 100 శాతం స్టేట్‌ జీఎస్టీని తిరిగి చెల్లిస్తారు.  

పీఎస్పీ ప్రాజెక్టులకు 45 ఏళ్ల లీజుకు స్థలాలు 
పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములను 45 ఏళ్ల లీజుకు కేటాయిస్తారు. వీటి స్థాపన కోసం ప్రైవేటు డెవలపర్లను టెండర్ల ద్వారా ఎంపిక చేస్తే, ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు. 6 ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి. 45 ఏళ్ల తర్వాత ప్రాజెక్టును ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. పీఎస్పీ విద్యుత్‌లో 80 శాతం తొలి హక్కు రాష్ట్రమే కలిగి ఉంటుంది.  

హైబ్రిడ్‌ పవర్‌కు ప్రాధాన్యత.. 
ఒకే ప్రాంతంలో సౌర+పవన, పవన+ఫ్లోటింగ్‌ సోలార్, విండ్‌+ స్టోరేజీ, హైబ్రిడ్‌+స్టోరేజీ వంటి పునరుత్పాదక ఇంధన స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ఈ పాలసీ ద్వారా ప్రోత్సహించనున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)