Breaking News

మేడిగడ్డలో రింగ్‌బండ్‌ తొలగింపు

Published on Fri, 07/05/2024 - 04:43

కాళేశ్వరం: జయ«శంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో 7వ బ్లాక్‌ చుట్టూ వేసిన రింగ్‌బండ్‌ను తొలగిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి నేపథ్యంలో గురువారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతేడాది అక్టోబర్‌ 21న బ్యారేజీ 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లు పగుళ్లు తేలి వంతెనతో పాటు కుంగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌డీఎస్‌ఏ సూచన మేరకు గ్రౌటింగ్, ఇసుక తొలగింపు, షీట్‌ఫైల్స్‌ అమరిక తదితర మరమ్మతులకు వీలుగా, 7వ బ్లాక్‌లోకి వరద చేరకుండా దానిచుట్టూ రింగ్‌బండ్‌ నిర్మించారు. 

అయితే వారం రోజులుగా ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో బ్యారేజీకి ప్రాణహిత వరద తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రింగ్‌బండ్‌ను తొలగించాలనే నిర్ణయానికొచ్చారు. రింగ్‌బండ్‌ను పొక్లెయినర్లతో తవ్వించి టిప్పర్ల ద్వారా మెటీరియల్‌ను బయటకు తరలిస్తున్నారు. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో గోదావరిలో ఉన్న రోడ్లను సైతం తొలగిస్తున్నారు. నిర్మాణ సంస్థకు సంబంధించిన వాహనాలు, మెటీరియల్‌ను పైకి తీసుకువెళ్తున్నారు.

ప్రస్తుతం మేడిగడ్డ వద్ద ప్రాణహిత ద్వారా 16 వేలకు పైగా క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ విషయమై ఇంజనీరింగ్‌ అధికారులను వివరణ అడగ్గా..మళ్లీ కుంగిందని, బొరియలు ఏర్పడ్డాయనే వదంతులు వచ్చాయని, కానీ అలాంటిదేమీ లేదని చెప్పారు. వర్షాలతో వరద నీరు రావడం వల్లే రింగ్‌బండ్‌ తొలగింపు పనులు చేపడుతున్నామని వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)