Breaking News

ఇంజనీరింగ్‌లో మిగిలిపోయిన సీట్లు 11,638

Published on Mon, 08/11/2025 - 04:46

సాక్షి, హైదరాబాద్‌: తుది దశ కౌన్సెలింగ్‌ పూర్తయినా ఇంజనీరింగ్‌లో ఇంకా 11,638 కన్వినర్‌ కోటా సీట్లు మిగిలిపోయాయి. ఎప్పటిలాగే కంప్యూటర్‌ కోర్సులకు డిమాండ్‌ పెరిగింది. సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సుల్లోనే సీట్లు ఎక్కువగా మిగిలాయి. అయితే, గ్రామీణ ప్రాంతాలు, నాణ్యత లేని కాలేజీల్లో కంప్యూటర్‌ బ్రాంచీల్లో సీట్లకు ఆప్షన్లు తగ్గాయి. దీంతో ఈ కాలేజీల్లో 5,261 సీట్లు మిగిలిపోయాయి. తుది దశ కౌన్సెలింగ్‌లో భాగంగా సాంకేతిక విద్యా విభాగం ఆదివారం సీట్లు కేటాయించింది. 

ఈ దశలో 40,837 మంది 16,86,699 ఆప్షన్లు ఇచ్చారు. కన్వినర్‌ కోటా కింద ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన మొత్తం 180 కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. మొత్తం 91,649 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తుది దశ ముగిసే నాటికి 80,011 (87.3 శాతం) సీట్లు కేటాయించారు. ఇంకా 11,638 సీట్లు మిగిలిపోయాయి. 46 ప్రైవేటు, 5 యూనివర్సిటీల పరిధిలోని 51 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 6,085 సీట్లు వచ్చాయి. ఈ విడతలో కొత్తగా విద్యార్థులు 4,720 మంది సీట్లు పొందారు. 20,028 మంది బ్రాంచీలు మార్చుకున్నారు. 

సీట్లు పొందినవారు ఈ నెల 13లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఆన్‌లైన్‌ స్లైడింగ్‌ నిర్వహిస్తారు. దీని ద్వారా కాలేజీల్లో అంతర్గతంగా బ్రాంచీలు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. కంప్యూటర్, దాని అనుబంధ ఎమర్జింగ్‌ కోర్సుల్లో 65,080 సీట్లు ఉంటే, 59,819 (91.92 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ఎల్రక్టానిక్స్, దాని అనుబంధ బ్రాంచీల్లో 17,754 సీట్లు ఉంటే, 14,118 (79.52 శాతం) భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్‌ వాటి అనుబంధ బ్రాంచీల్లో 7,675 సీట్లు ఉంటే, 5,236 (68.22 శాతం) నిండాయి. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు