Breaking News

స్టాఫ్‌నర్స్‌ ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితా విడుదల

Published on Fri, 12/29/2023 - 04:17

సాక్షి, హైదరాబాద్‌: స్టాఫ్‌నర్స్‌ పోస్టుల మెరిట్‌ జాబితాను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మేంట్‌ బోర్డ్‌ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీన విడుదల చేసిన రాత పరీక్ష ఫలితాలపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.

ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయాలని నిర్ణయించామని తెలిపారు. మొత్తం స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు 40,936 మంది దరఖాస్తు చేశారు. అందులో 38,674 మంది రాత పరీక్ష రాశారు. వారిలో నుంచి 8,892 మందిని సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు పిలిచినట్లు ఆయన వివరించారు. శనివారం (30వ తేదీ) నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తామని చెప్పారు.

వెరిఫికేషన్‌ ఎక్కడంటే.. 
ఎక్సైజ్‌ అకాడమీ ఫర్‌ స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ (ఈస్ట్‌), 120/పీ, సెయింట్‌ మైకేల్స్‌ కాలనీ, అభ్యుదయన గర్, అభ్యుదయ నగర్‌ కాలనీ, బండ్లగూడ జాగీర్, హైదరాబాద్‌లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జరుగుతుంది. దరఖాస్తుదారులు ఒరిజినల్‌ సర్టిఫికె ట్లు, డాక్యుమెంట్లతోపాటు వాటికి సంబంధించి రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలను తీసుకురావాలి. అలాగే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన దరఖాస్తు ఫారమ్‌ పీడీఎఫ్‌ను వెంట తీసుకొని రావాలి.

ఎవరెవరు ఏయే సర్టిఫికెట్లు తేవాలంటే..
ఆధార్‌ కార్డ్, పుట్టిన తేదీ రుజువు సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌ వర్తించేవారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్‌ తీసుకురావాలి. నాన్‌ క్రీమీలేయర్‌ సర్టిఫికెట్‌ అందించని బీసీలను ఓసీలుగా పరిగణిస్తారు.

ఈడబ్ల్యూఏఎస్‌ రిజర్వేషన్‌ క్లెయిమ్‌ చేసే అభ్యర్థులు తాజా ఆదాయ ధ్రువీకరణపత్రం తీసుకురావాలి. స్పోర్ట్స్‌ కేటగిరీ కింద రిజర్వేషన్‌ను క్లెయిమ్‌ చేసే వారు స్పోర్ట్స్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలి. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్‌ తీసుకురావాలి. స్థానికతను తెలిపే సర్టిఫికెట్లు, జీఎన్‌ఎం లేదా బీఎస్సీ నర్సింగ్‌ సర్టిఫికెట్, తెలంగాణ నర్సింగ్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, ఒక పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో వెంట తీసుకొని రావాలి.

ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తేకుంటే అభ్యర్థిత్వం రద్దు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాకపోవడం లేదా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకురాకపోతే వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తారు. ప్రొవిజినల్‌ జాబితా ఎంపిక జాబితా కాదని గోపీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, 7,094 స్టాఫ్‌నర్స్‌ పోస్టులను భర్తీ చేస్తారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు వచ్చిన వారిలో అనర్హులుండి, పోస్టుల కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధిస్తే, తమ వద్ద ఉన్న అర్హుల జాబితా నుంచి మరికొందరిని పిలుస్తామని ఆయన తెలిపారు.  

నిర్ణీత రోజుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సమయం...
ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే ఆరో తేదీ వరకు ప్రతి రోజూ మూడు సెషన్లలో సర్టిఫికెట్ల వెరిఫి కేషన్‌ నిర్వహిస్తారు. ప్రతీ సెషన్‌లో 400 నుంచి 500 మంది సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఈ మేర కు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. 

మొదటి సెషన్‌:
ఉదయం 9.15 నుంచి 11.15 గంటల వరకు
రెండో సెషన్‌: 
మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు
మూడో సెషన్‌:
మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు 

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు