Breaking News

అల్లు అర్జున్‌కు రెగ్యులర్‌ బెయిల్‌

Published on Sat, 01/04/2025 - 05:21

సిటీ కోర్టులు (హైదరాబాద్‌):  పుష్ప–2 ప్రీమియర్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరోపణ­లు ఎదుర్కొంటున్న సినీ నటుడు అల్లు అర్జున్‌కు శు­క్రవారం నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూ­రు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, రూ.50 వేలతో రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పి­ంచాలని సూచించింది. ప్రతి ఆదివారం సంబంధిత పోలీస్‌స్టేషన్‌ (చిక్కడపల్లి)లో హాజరు కావా­లని ఆదేశించింది. 

డిసెంబర్‌ 5న జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కొడుకు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఘటనపై రేవతి భర్త భాస్కర్‌ చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్‌ను ఏ–11గా చేర్చిన పోలీసులు.. సెక్షన్‌ 105, 118(1), రెడ్‌విత్‌ 3(5) బీఎన్‌ఎస్‌ కింద కేసులు నమోదు చేశారు. డిసెంబర్‌ 13న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయగా నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజి్రస్టేట్‌ జడ్జి నిర్మల 14 రోజుల రిమాండ్‌ విధించారు. 

కానీ హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ గడువు ఈనెల 10న పూర్తికానుండగా.. అల్లు అర్జున్‌ నాంపల్లిలోని 2వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో డిసెంబర్‌ 26న రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పును వాయిదా వేసిన జడ్జి వినోద్‌కుమార్‌.. శుక్రవారం తీర్పు వెలువరించారు. ఇదిలా ఉండగా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అల్లు అర్జున్‌ క్వాష్‌ పిటిషన్‌పై ఈనెల 21 వాదనలు ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాదులు మీడియాకు తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)