Breaking News

అభ్యంతరకరంగా రీల్స్‌.. ఇద్దరు యువకుల అరెస్ట్‌

Published on Wed, 02/18/2026 - 10:31

హైదరాబాద్: సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు మహా శివరాత్రి రోజు శివుడికి మాదకద్రవ్యాలను ప్రసాదంగా పెడుతున్నామంటూ రీల్స్‌ చేసిన ఇద్దరు యువకులు కటకటాలపాలయ్యారు. ఇన్‌స్పెక్టర్‌ ఏరుకొండ సీతయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జంగమ్మెట్‌ రవీందర్‌ నాయక్‌ నగర్‌ కాలనీకి చెందిన సభావత్‌ శ్రీచరణ్‌(, వడ్త్యా విజయ్‌ కృష్ణ జిమ్‌లో పని చేసేవారు. 

మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న వీరు శంషాబాద్‌ శివారులోని ఓ శివాలయానికి వెళ్లి ‘శివుడికి అందరూ కొబ్బరి కాయలు కొడతారు...కాని మేము స్పెషల్‌ ప్రసాదం పెడుతున్నామంటూ గంజాయి’ చూపుతూ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు చార్మినార్ జోన్‌ టాస్‌్కఫోర్స్‌ పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి, తదుపరి విచారణ నిమిత్తం ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  
 
ఫేమస్‌ కావడం కోసం ఎంతకైనా తెగిస్తారా...? 
–సీపీ సజ్జనార్‌ 
దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా...? ఫేమస్‌ కావడం కోసం ఎంతకైనా తెగిస్తారా...? అంటూ ఈ ఘటనపై నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘మహా శివరాత్రి భక్తికి నిదర్శనం...ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. మేమేదో సాహసం చేశామని అనుకుంటున్నారా!? అస్సలు కాదు...ఇది కటకటాల వెనుకకు చేర్చే తీవ్రమైన నేరం! ఒక్కసారి ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రయోగిస్తే...జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది.

లైక్‌ల కోసం–లోకాన్ని మరిచి...వ్యూస్‌ కోసం–విలువలనే వదిలి..రీల్స్‌ కోసం–రోడ్డున పడి...మత్తులో మునిగి–జీవితాలను నాశనం చేసుకుంటారా!? చెప్పండి. క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్‌ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టకండి. ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించం. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్‌ మీడియాను మీ సృజనాత్మకతకు వేదికగా మార్చుకోండి...వ్యసనాలకు వాకిలిగా కాదు’......అంటూ చెప్పుకొచ్చారు.    

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)