Breaking News

శాంతిస్తున్న గోదావరి

Published on Tue, 07/30/2024 - 00:24

సాక్షి, హైదరాబాద్‌/భద్రాచలం: ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉపనదులు, వాగు లు, వంకల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో సోమవారం గోదావరినదిలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. ఉగ్రరూపం దాలి్చన గోదావరి శాంతిస్తుండటంతో తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి చేరుతున్న ప్రవాహం 5.12 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా మేడిగడ్డ బ్యారేజ్‌ నుంచి దిగువకు వదిలేస్తున్నారు.

దానికి ఇంద్రావతి ప్రవాహం తోడవుతుండటంతో తుపాకులగూడెం(సమ్మక్క) బ్యారేజ్‌లోకి చేరుతున్న 8.56 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం (సీతమ్మసాగర్‌) బ్యారేజ్‌లోకి 9.52 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గుతుండటంతో భద్రాచలం వద్ద సోమవారంరాత్రి 9 గంటలకు నీటిమట్టం 42.90 అడుగులకు చేరుకుంది.

దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను  ఉపసంహరించారు. భద్రాచలం నుంచి అన్ని వైపులకు రాకపోకలు పునఃప్రారంభమ య్యాయి. కాగా ముంపు కాలనీ వాసులను సోమవారం సైతం పునరావాస శిబిరాల్లోనే కొనసాగించారు.  పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహం 11.78 లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో స్పిల్‌ ఎగువన నీటిమట్టం 33.46 మీటర్లకు తగ్గింది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి వచ్చిన వరదను దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,50,084 క్యూసెక్కులు చేరుతుండగా.. 14,42,384 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)