Breaking News

డబుల్‌ పెన్షనర్ల నుంచి రూ.10 లక్షలు రికవరీ

Published on Mon, 07/15/2024 - 03:45

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ సర్వీసు పెన్షన్లు, సామాజిక ఆసరా పెన్షన్‌.. రెండూ పొందుతున్న పది మంది రూ.10 లక్షలను తిరిగి ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. జిల్లాలో 71 మంది రెండు పెన్షన్లు పొందుతున్నట్లుగా పేర్కొంటూ జూలై 6న ‘సాక్షి’లో ‘ప్రభుత్వ పెన్షనర్లకు ఆసరా’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో రెండు పెన్షన్లు పొందుతున్న వారికి పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీచేశారు. రెండు పెన్షన్లు పొందుతున్న వారు ఆసరా పెన్షన్‌ డబ్బులను తిరిగి చెల్లించాలని ఆదేశించారు.

కాగా, ఏళ్ల తరబడి పొందిన ఆసరా పెన్షన్‌ డబ్బులను ఒకేసారి చెల్లించడం ఇబ్బందిగా ఉండడంతో రికవరీకి సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వారికి వెసులుబాటు కలి్పంచారు. ఇప్పటికే 10 మంది రూ.10 లక్షలు చెల్లించగా.. ఇంకా 61 మంది, రూ.47.75 లక్షల మేరకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని దశలవారీగా రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆసరా పెన్షన్లు నిలిపివేసి, సరీ్వసు పెన్షన్‌ నుంచి ఆ సొమ్మును దశలవారీగా రికవరీ చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేయకుండా వాయిదా పద్ధతిలో వసూళ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)