Breaking News

ఎస్సీ వర్గీకరణపై సిఫారసులు రెడీ

Published on Tue, 02/04/2025 - 02:11

సాక్షి, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ అధ్యక్షతన ఏర్పాటైన ఏకసభ్య కమిషన్‌ ఆ ప్రక్రియ పూర్తి చేసింది. సోమవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉపసంఘం కో చైర్మన్, మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యుడు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయ్యింది. 

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసేందుకు అవసరమైన సిఫారసులతో కూడిన నివేదికను జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీకి సమరి్పంచారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు.. రాష్ట్ర మంత్రివర్గానికి సిఫారసులు చేయనున్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా చర్చించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 

2011 జనగణన ఆధారంగా.. 
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేసింది. 2011 జనగణన ఆధారంగా పరిశీలన చేపట్టాని, అరవై రోజుల్లోగా అధ్యయనం పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బూర్గుల రామకృష్ణారావు భవన్‌ మొదటి అంతస్తు బి బ్లాక్‌లో కార్యాలయాన్ని కేటాయించింది. కమిషన్‌కు సహకరించేందుకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు సంచాలకులు ఉమాదేవి, శ్రీధర్‌లను ప్రభుత్వ నియమించింది. నవంబర్‌ 11న కమిషన్‌ బాధ్యతలు స్వీకరించింది. అనంతరం క్షేత్రస్థాయిలో అధ్యయనం మొదలుపెట్టింది. 

రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ విచారణ కార్యక్రమాలు చేపట్టింది. క్షేత్రస్థాయి పరిశీలన, కులసంఘాలు, ప్రజా సంఘాలతో సమావేశాలు, వినతులు, విజ్ఞాపనల స్వీకరణ తదితరాలు కొనసాగించింది. దీంతో పాటు ఆన్‌లైన్‌ పద్ధతిలో వినతులు, సలహాలు, సూచనలు, అభ్యంతరాలను కూడా స్వీకరించింది. అన్ని కోణాల్లో పరిశీలన, సమాచార సేకరణతో పాటు ఆన్‌లైన్‌లో వచి్చన వినతులు, ప్రభుత్వ విభాగాల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి నివేదిక తయారు చేసింది.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు