Breaking News

జీఎస్‌డీపీ రూ.14.56 లక్షల కోట్లు

Published on Tue, 09/09/2025 - 04:29

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏటేటా గణనీయంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. నాలుగేళ్ల క్రితం రూ.10 లక్షల కోట్లకు పైగా స్థూల ఉత్పత్తి నమోదు కాగా, తాజాగా 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.14.56 లక్షల కోట్లకు చేరింది. అంటే గత నాలుగేళ్లలోనే దాదాపు 50% పెరిగిందన్నమాట. 

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల వెలువరించిన హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్‌ ఆన్‌ ఇండియన్‌ ఎకానమీ లో ఈ గణాంకాలను పొందుపరిచింది. ఈ కరదీపిక ప్రకారం 2023–24లో తెలంగాణ స్థూల ఉత్పత్తి రూ.13,22, 808 కోట్లు కాగా, ఏడాది కాలంలో 1.3 లక్షల కోట్లు పెరిగి రూ.14,56,837 కోట్లుగా నమోదైంది.  

తలసరి ఉత్పత్తి రూ.3 లక్షల పైమాటే: ఆర్‌బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణ తలసరి స్థూల ఉత్పత్తి రూ.3.79 లక్షలకు చేరింది. 2024–25లో రూ.3,79,751గా తలసరి స్థూల ఉత్పత్తి నమోదైందని, ఇది 2023–24తో పోలిస్తే రూ.33 వేలు పెరిగిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ ఏర్పాటైన ఏడాది 2014–15లో తలసరి స్థూల ఉత్పత్తి రూ.1,24,104 కాగా, ఇప్పుడు మూడు రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. 

పదేళ్ల కాలంలో 2.55 లక్షలు పెరిగింది. ఇక, రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణాంకాలు కూడా ఇదే నిష్పత్తిలో పెరిగాయి. రాష్ట్రం ఏర్పాటైన ఏడాది తెలంగాణ స్థూల ఉత్పత్తి రూ.4,56,280 కోట్లు కాగా, పదేళ్ల తర్వాత ఏకంగా రూ.10 లక్షల కోట్లు పెరిగింది. 

» ఆర్‌బీఐ వెల్లడించిన ఈ నివేదిక ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు స్థూల ఉత్పత్తి నమోదులో పురోగతిని కనబరుస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ (రూ.14,22,998 కోట్లు), కర్ణాటక (రూ. 26,03,948 కోట్లు), తమిళనాడు (రూ. 27,64,755 కోట్లు)లు కూడా దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల సరసన నిలిచాయి.  
» తెలంగాణ విషయానికి వస్తే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతోపాటు సేవల రంగం విస్తృతి కారణంగా భారీ స్థాయిలో జీఎస్‌డీపీ నమోదైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.  

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)