Breaking News

ఏటా రూ.15 వేల కోట్లపైనే!

Published on Sat, 01/25/2025 - 01:54

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా తెచ్చుకున్న అప్పుల తిరిగి చెల్లింపుపై రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) స్పష్టతనిచ్చింది. 2015 జనవరి 1వ తేదీ నుంచి 2025 జనవరి 15వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం రూ.3,49,137 కోట్లను బాండ్ల వేలం ద్వారా తీసుకున్నట్టు వెల్లడించింది. గరిష్టంగా 45 ఏళ్ల కాలపరిమితితో ఈ నిధులు సమీకరించారని.. అంటే 2060 నాటికి ఈ అప్పులన్నింటినీ తీర్చాల్సి ఉంటుందని తాజాగా విడుదల చేసిన ‘ఔట్‌ స్టాండింగ్‌ స్టేట్‌ గవర్నమెంట్స్‌ సెక్యూరిటీస్‌’నివేదికలో తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రా­లు చేసిన అప్పుల లెక్కలను అందులో వెల్లడించింది. తెలంగాణ వచ్చే నాలుగేళ్లలో రూ.60.947.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. 

ఈ ఏడాది రూ.17 వేల కోట్ల పైమాటే.. 
రాష్ట్రం బాండ్ల వేలం ద్వారా సేకరించిన రుణాలను ఏ సంవత్సరంలో ఎంత తీర్చాల్సి ఉంటుందో ఆర్‌బీఐ తాజా నివేదికలో వెల్లడించింది. దాని ప్రకారం 2025లో రూ.17,150 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంది. 2026లో రూ.20వేల కోట్లను అప్పులకు అసలు, వడ్డీ కింద చెల్లించాలి. మొత్తమ్మీద వచ్చే నాలుగేళ్లలో రూ.60 వేల కోట్లకు పైగా చెల్లించాలి. ఇవి రిజర్వు బ్యాంకు ద్వారా బహిరంగ మార్కెట్‌లో తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ మాత్రమేనని.. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపు అదనమని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

గడువు తీరిన నాటి నుంచి.. 
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రూపాల్లో అప్పులు తీసుకుంటుంది. అందులో ప్రధానమైనవి ఆర్బీఐ ద్వారా సేకరించే రుణాలు. ఆర్థిక శాఖ వర్గాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉండే సెక్యూరిటీ బాండ్లను ఆర్బీఐ వేదికగా బహిరంగ మార్కెట్‌లో వేలానికి పెట్టి ఈ నిధులను సమకూర్చుకుంటుంది. ఇన్ని కోట్ల విలువైన బాండ్లను వేలం వేస్తున్నామని, ఇన్ని సంవత్సరాల కాలపరిమితిలో, ఇంత వడ్డీ చెల్లించి రుణం తీరుస్తామని ఆర్బీఐకి ఇండెంట్‌ పెడుతుంది. ఆర్బీఐ వేలంలో పాల్గొన్న సంస్థలు.. ఆ బాండ్లను స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు బాండ్ల కాలపరిమితి ముగిసిన కొద్దీ అసలు, వడ్డీ కలిపి చెల్లించి బాండ్లను విడిపించుకుంటాయి. మళ్లీ అవసరాన్ని బట్టి అవే బాండ్లను వేలానికి పెట్టి నిధులు తెచ్చుకుంటాయి.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు