Breaking News

కమీషన్‌ కోసం డీలర్ల ప'రేషన్‌'..

Published on Sun, 07/20/2025 - 04:45

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే ఆగస్టు వరకు పేదలకు పీడీఎస్‌ బియ్యం పంపిణీ చేసిన రేషన్‌ డీలర్లు ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మార్చినెల వరకే ప్రభుత్వం రేషన్‌ కమీషన్‌ అందజేసింది. ఏప్రిల్‌ నెల నుంచి ఇవ్వకపోగా, జూన్‌ నెలలో ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయడంతో ఐదు నెలల కమీషన్‌ పెండింగ్‌లో ఉంది.  

17,286 రేషన్‌ దుకాణాలు 
రాష్ట్ర వ్యాప్తంగా 92 లక్షల ఆహార భద్రతాకార్డులు (రేషన్‌కార్డులు) ఉండగా, ఆయా కార్డుదారులకు 17,286 రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతి నెల 1.70 లక్ష­ల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. క్వింటాల్‌కు రూ.140 చొప్పున ప్రభుత్వం డీలర్లకు చెల్లిస్తుంది. ఈ లెక్కన 1.70 లక్షల మెట్రిక్‌ టన్నులకు ప్రతి నెలా రూ.23 కోట్ల వరకు కమీషన్‌ కింద ఇస్తోంది. ఐదు నెలలకుగాను రూ.115కోట్ల వరకు డీలర్లకు చెల్లించాల్సి ఉంది. 

గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కో డీలర్‌కు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు బకాయిలు రావాల్సి ఉండగా, జీహెచ్‌ఎంసీతోపాటు మునిసిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో రూ.లక్షకు పైగానే బకాయిలు ఉన్నాయి. ఇటీవల రేషన్‌ డీలర్ల కమీషన్‌ విడుదల చేయాలని రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొక్కొండ వైకుంఠం పౌరసరఫరాల శాఖ సంయుక్త కమిషనర్‌ మనోహర్‌కుమార్‌ రాథోడ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. 

కమీషన్‌ను రూ.140 నుంచి 300కు పెంచాలని డీలర్లు కోరుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ కమీషన్‌ పెంపుపై హామీ ఇచ్చిoది. ప్రతి రేషన్‌ డీలర్‌కు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం కూడా ఇస్తామని చెప్పింది. అయితే రేషన్‌ డీలర్లకు ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)