Breaking News

కరీంనగర్‌లో దరఖాస్తు.. మహబూబ్‌నగర్‌లో మంజూరు

Published on Tue, 05/27/2025 - 11:47

మహబూబ్‌నగర్‌ రూరల్‌: రేషన్‌ కార్డు కోసం కరీంనగర్‌ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడికి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంజూరు అయింది. అధికారుల తప్పిదం కారణంగా అక్కడ జారీ చేయాల్సిన కార్డు ఇక్కడ రావడంతో లబి్ధదారుడికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని మంకమ్మతోటకు చెందిన మాడిశెట్టి లక్ష్మణ్‌ కొత్త రేషన్‌ కార్డు కోసం తన ఆధార్‌ కార్డు గుర్తింపుగా స్థానికంగా దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన కార్డు జారీకి సంబంధించిన ప్రక్రియ నిర్వహించిన సంబంధిత శాఖ సిబ్బంది, అధికారులు కార్డు కోసం కరీంనగర్‌కు బదులుగా మహబూబ్‌నగర్‌ అని కంప్యూటర్‌లో పొందుపరిచారు.

దీంతో ఆయనకు మహబూబ్‌నగర్‌లోని 1425022 రేషన్‌ షాపును కేటాయించారు. తనకు పొరపాటున జారీ చేసిన కార్డును రద్దు చేసి కొత్తది తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఇవ్వాలని కరీంనగర్‌ జిల్లా అధికారులకు విన్నవించుకోగా.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జారీ చేసిన కార్డు రద్దు చేస్తేనే నూతనంగా కరీంనగర్‌ జిల్లాలో కార్డు జారీ చేస్తామని తిరకాస్తు పెట్టారు. అంతేకాక అధికారులు చేసిన తప్పిదానికి తనను బలి చేయడం ఏమిటని ప్రశి్నస్తున్నారు. ఎలాగైనా తనకు కరీంనగర్‌ జిల్లాకు సంబంధించిన కార్డు జారీ చేయాలని లక్ష్మణ్‌ కోరుతున్నారు.

కార్డును రద్దు చేస్తాం.. 
కరీంనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో నమోదు మేరకు రేషన్‌ కార్డు మహబూబ్‌నగర్‌లో జారీ అయ్యిందని మహబూబ్‌నగర్‌ జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. అక్కడి అధికారుల పొరపాటు కారణంగా ఇక్కడి జారీ అయిన కార్డును రద్దు చేసి లబ్ధిదారుడికి అసౌకర్యం కలగకుండా చూస్తామని పేర్కొన్నారు.  

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు