Breaking News

రసూల్‌పురా ఫ్లై ఓవర్‌ డిజైన్‌.. మారున్‌..

Published on Wed, 01/08/2025 - 07:58

సాక్షి, సిటీబ్యూరో: హై సిటీ (హైదరాబాద్‌ సిటీ  ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) పథకం కింద ఫ్లై ఓవర్లు, రహదారులు తదితర పనులకు ప్రభుత్వం రూ.7 వేల కోట్లకు పైగా పరిపాలన అనుమతులు మంజూరు చేయడంతో పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు.  కొన్ని ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా  ఇప్పటికే రూపొందించిన డిజైన్లను మార్చాలని భావిస్తున్నారు. అలా.. ఆల్విన్‌ జంక్షన్, జేఎన్‌టీయూ జంక్షన్ల వద్ద డిజైన్ల మార్పునకు ఇప్పటికే కన్సల్టెంట్లను ఆహా్వనించిన అధికారులు తాజాగా రసూల్‌పురా ఫ్లై ఓవర్‌/అండర్‌పాస్‌ డిజైన్లను కూడా మార్చేందుకు సిద్ధమయ్యారు.  

ప్రత్యామ్నాయ డిజైన్‌ అవసరం.. 
మెట్రో రెండోదశ  దృష్టిలో ఉంచుకొని ఆల్విన్, జేఎన్‌టీయూ జంక్షన్ల వద్ద డిజైన్ల మార్పుకు సిద్ధమైన అధికారులు బేగంపేట సమీపంలోని రసూల్‌పురా ఫ్లై ఓవర్‌ /అండర్‌పాస్‌ నిర్మాణానికి డిఫెన్స్‌ భూములు సేకరించాల్సి ఉందన్నారు. ఎక్కువ భూ ములు ఇచ్చేందుకు సంబంధిత అధికారులు సుముఖంగా లేకపోవడంతో భూసేకరణ వీలైనంత తగ్గించేందుకు కొత్త డిజైన్ల కోసం కన్సల్టెంట్లను ఆహా్వనించినట్లు పేర్కొన్నారు. ఈ టెండరు పొందే కన్సల్టెంట్స్‌ ఇప్పటికే ఉన్న డిజైన్‌ను పరిశీలించి, ప్రత్యా మ్నాయ డిజైన్‌ను రూపొందించాల్సి ఉంటుంది.  

రూ.105 కోట్లు మంజూరు.. 
ఈ ఫ్లై ఓవర్‌/అండర్‌పాస్‌ పనులకు ప్రభుత్వం రూ. 105 కోట్లు మంజూరు చేయడంతో పని ప్రారంభించేందుకు పరిస్థితుల్ని అధ్యయనం చేసిన అధికారులు  ప్రత్నామ్నాయ డిజైన్‌తో ప్రాజెక్ట్‌ ప్రిపరేషన్‌ రిపోర్ట్‌ కోసం (పీపీఆర్‌) కన్సల్టెంట్లను ఆహా్వనించారు. తక్కువ భూసేకరణతో పాటు  ప్రజల భద్రత, సేవల పెంపుదల కొత్త డిజైన్‌ ప్రధాన లక్ష్యం. సేకరించాల్సిన ఆస్తుల సరిహద్దులతోపాటు యుటిలిటీస్‌ షిఫ్టింగ్‌ వంటి అంశాలను కూడా బేరీజు వేసి, ఉన్న  డిజైన్‌ కంటే మెరుగైన డిజైన్‌ రూపొందించాల్సి ఉంటుంది.  

 సమీప ప్రాంతాల్లో ప్రస్తుతం పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు, మెట్రో రైలు, బీఆర్‌టీఎస్, సీటీఎస్‌ మాస్టర్‌ప్లాన్‌లను కూడా దృష్టిలో ఉంచుకోవడంతో పాటు ప్రాజెక్టు వ్యయం తగ్గేందుకు కూడా తగిన  మార్గాలుంటే సూచించాలి. ఇంకా, మేజర్‌ జంక్షన్లు, బాటిల్‌నెక్స్, ప్రార్థనా మందిరాలు, శ్మశాన వాటికల వంటి వాటిని దృష్టిలో ఉంచుకోవాలి. రాబోయే ఇరవయ్యేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ఫ్రీగా ప్రయాణం సజావుగా సాగేందుకు శాశ్వత పరిష్కారంగా కొత్త డిజైన్‌ ప్లాన్‌ ఉండాలి.  

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)