Breaking News

ఖమ్మం జిల్లాలో నీలి పుట్టగొడుగులు

Published on Sun, 08/17/2025 - 06:06

ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం జిల్లాలోని పులిగుండాల అటవీ ప్రాంతంలో అరుదైన నీలి పుట్టగొడుగులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వీటిని ‘బ్లూ పిన్కిగిల్‌ మశ్రూమ్‌ ఎంటొలోమా హోచెస్టెటెరి’జాతికి చెందిన పుట్టగొడుగులుగా నిర్ధారించారు. గతంలో ఆదిలాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ అటవీ విభాగంలో ఈ జాతి పుట్టగొడుగును గుర్తించగా, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కనిపించాయి. ఈ నీలిరంగు పుట్టగొడుగులకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ఆకర్షణీయంగా ఆకాశ నీలిరంగులో ఉంటుంది. దీంతో దీన్ని స్కై బ్లూ మశ్రూమ్‌ అని అంటారు.

న్యూజిలాండ్‌కు చెందిన ఈ జాతి మనదేశంలో అరుదుగా కనిపిస్తోంది. ఎంటొలోమా జాతికి చెందిన ఈ పుట్టగొడుగులు విషపూరితమని అటవీ అధికారులు భావిస్తున్నారు. దీంతో వీటిని ఆహారంగా వినియోగించవచ్చా.. లేదా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, పులిగుండాల అటవీ ప్రాంతంలో ఈ పుట్ట గొడుగు కనిపించడంతో ఖమ్మం అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యం ప్రత్యేకతను సంతరించుకుంది.

అధ్యయనానికి చర్యలు
ఖమ్మం అడవుల్లో అరుదైన పుట్టగొడుగు జాతి దర్శనమిచ్చింది. ఇది ఇక్కడి పర్యావ రణ ప్రాధాన్యతను మరింతగా బలపరు స్తోంది. జీవవైవిధ్యం రక్షణలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. అయితే, ప్రజలు అడ వుల్లో తెలియని పుట్టగొడుగులను తాకొద్దు, తినొద్దు. ఎందుకంటే ఇవి విషపూరితమై ఉండొచ్చు. అందువల్ల ఈ జాతిపై మరింతగా అధ్యయనం చేయనున్నాం. –సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్, ఖమ్మం జిల్లా అటవీ అధికారి

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)