Nalgonda: రాపిడో రయ్‌ రయ్‌!

Published on Sun, 05/04/2025 - 10:57

మనం ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలంటే బస్సులేదా ఆటో, సొంత వాహనం అవసరం. కానీ ఇప్పుడు రాపిడో యాప్‌లో బుక్‌ చేసుకుంటే వాహనం మన ముందుకొచ్చి ఆగుతుంది. గమ్య స్థానానికి చేర్చుతుంది. ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన ఇలాంటి బైక్‌ ట్యాక్సీ సర్వీసులు ఇప్పుడు జిల్లా కేంద్రాలకు విస్తరించాయి. వీటి రాకతో ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం రాపిడో యాప్‌లో బైక్, ఆటో సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతోంది.  

(నల్లగొండ), సూర్యాపేట టౌన్ : భువనగిరి టౌన్‌   ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, భువనగిరిలో ‘రాపిడో’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆయా పట్టణాల పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు రాపిడో యాప్‌ ద్వారా ఆటో, బైక్‌ బుక్‌ చేసుకుంటే చాలు మన ఇంటి దగ్గరకే ఆటో, బైక్‌ వచ్చి మనల్ని పికప్‌ చేసుకుంటాయి. అందుకు ముందుగా మనం చేయవలసిందల్లా మన సెల్‌ఫోన్‌లోని ‘ప్లే స్టోర్‌’ నుంచి ‘రాపిడో’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం కొన్ని ఆప్షన్స్‌ పూరించాక అది మన సేవలకు సిద్ధమవుతుంది. మనం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే యాప్‌ ఓపెన్‌ చేస్తే వెళ్లే లోకేషన్‌ అడుగుతుంది. దాన్ని పూరించాక, ప్రయాణ చార్జీని తెలుపుతుంది. మనకు సమ్మతమైతే వెంటనే ఓకే ఆప్షన్‌ నొక్కగానే వాహనం మన దగ్గరకు ఎన్ని నిమిషాల్లో చేరుకుంటుందో తెలియజేస్తుంది. వాహనం రాగానే మనల్ని పికప్‌ చేసుకుని, గమ్య స్థానానికి చేరుస్తుంది. ఇది పట్టణ ప్రజల రవాణా సౌకర్యార్థం, నిరుద్యోగుల ఉపాధికి బాసటగా నిలుస్తోంది.

నల్లగొండలో 90 వాహనాలు
⇒ నల్లగొండ పట్టణంలో రాపిడోలో 90 వరకు వాహనాలు నడుస్తున్నాయి. పట్టణం పరిధిలో ప్రస్తుతం కేశరాజుపల్లి, ఎస్‌ఎల్‌బీసీ, కతాల్‌గూడ, పానగల్లు, ఎంజీ యూనివర్సిటీ వరకు ఈ సేవలు కొనసాగుతున్నాయి. డిమాండ్‌ పెరిగితే ఇంకా విస్తరించే అవకాశం ఉంది.
⇒  రాపిడో సర్వీసులు భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్‌ పట్టణాల్లోనూ అందుబాటులోకి వచ్చాయి. వీటి రాకతో ప్రజలకు ఎంతో సౌకర్యవంతమైన సేవలు అందుతున్నాయి. యాదిరిగుట్ట నుంచి ఎయిమ్స్‌ వరకు ఆటో, బైక్‌ సెలవు అందుబాటులో రావడంతో పాటు, బీబీనగర్‌ ఎయిమ్స్‌ నుంచి కార్లు కూడా అందుబాటులో వచ్చాయి.  

⇒ సూర్యాపేటలో ప్రస్తుతం రాపిడోలో 30 బైక్‌లు, 20 గాఆటో ట్యాక్సీలు నడిపిస్తున్నారు. గతంలో సూర్యాపేట పట్టణం పరిసర ప్రాంతాలు చుట్టూ ఆరు కిలోమీటర్ల వరకు రాపిడో ట్యాక్సీలు నడిపించారు. ఇప్పడు జిల్లా కేంద్రం నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా ట్యాక్సీలు నడిస్తున్నారు. దీంతో ప్రయణికులు వారు వెళ్లే ప్రాంతానికి రాపిడో బుక్‌  చేసుకుంటున్నారు.  

యువతకు ఉపాధి అవకాశం
రాపిడో యాప్‌ ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి పొందుతోంది. ముఖ్యంగా చిన్నచిన్న ఉద్యోగాలు లేదా ప్రైవేట్‌ కంపెనీల్లో పనిచేసే యువత పార్‌టైంగా రాపిడో యాప్‌ ద్వారా ప్రయాణికులను చేరవేసి ఆదాయం పొందుతోంది. ముందుగా యువత రాపిడో కెప్టెన్‌ అనే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని వాహన వివరాలు, లైసెన్స్, మొబైల్‌ నంబర్లను పొందుపర్చాలి. ఎవరైతే ప్రయాణికుడిగా దగ్గరగా ఉంటారో వారికి మెసేజ్‌ వెళ్లడంతో క్షణాల్లో అక్కడి వెళ్లి ప్రయాణికుడిని గమ్యస్థలం చేరుస్తున్నారు. ఫుల్‌టైం పని చేసేవారు రోజుకు రూ.700 నుంచి రూ.1000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే వీరంతా ఆ డబ్బును వారంలో రెండుసార్లు మాత్రమే తమ ఖాతా నుంచి డ్రా చేసుకోవాల్సి

రోజూ మూడు, నాలుగు రైడ్‌లు
నేను ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నాను. నాకున్న బైక్‌ను రాపిడో యాప్‌లో యాడ్‌ చేశాను. నల్లగొండలో రోజూ మూడు నుంచి నాలుగు రైడ్‌లకు వెళ్తున్నా. ప్రస్తుతం రూ.200 నుంచి రూ.400 వరకు వస్తున్నాయి. రాపిడో సేవలు అందుబాటులో ఉన్నా చాలా మందికి తెలియకపోవడంతో సర్వీసులు అంతంత మాత్రంగానే ఉన్నాయి.     
 – రమేష్, రైడర్, నల్లగొండ  

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)