Breaking News

తెలంగాణ శ్రీరంగం

Published on Fri, 12/20/2024 - 04:52

వనపర్తి: తమిళనాడులోని శ్రీరంగం రంగనాయకుడిని వనపర్తి సంస్థానాధీశులు ఇంటి దైవంగా కొలుస్తూ పూజించేవారు. తమ సంస్థానంలోని కొర్విపాడు (పెబ్బేరు మండలం శ్రీరంగాపురం) గ్రామంలోని రంగసముద్రం చెరువు ఒడ్డున ఉన్న గరుడకొండపై శ్రీరంగాన్ని పోలిన రంగనాథస్వామి ఆలయాన్ని 345 ఏళ్ల క్రితం అప్పటి సంస్థానాధీశుడు గోపాలరావు నిర్మించినట్టు స్థలపురాణం చెబుతోంది. అనంతరం కొర్విపాడు పేరును శ్రీరంగాపురంగా మార్చారు. 

ద్వీపకల్పంగా దర్శనమిచ్చే ఈ దేవాలయానికి రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకత ఉంది. పురాతన ఆలయాల మాదిరిగా నేలమాలిగలను సైతం నిర్మించి.. అందులో పురాతనమైన తంజావూరు పెయింటింగ్స్‌ను భద్రపరిచారు. దేవాలయాన్ని, అందులో కొలువుదీరిన స్వామివారి మూలవిరాట్‌ను తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో మాదిరిగానే ప్రతిష్ఠించారు. సంస్థానాధీశుల కాలంలో శ్రీరంగాపురం క్షేత్రం కవి, పండితులకు ఆస్థాన కేంద్రంగా భాసిల్లింది. సభలు, సమావేశాలకు ఆతిథ్యమిచ్చింది. 

ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాల సమయంలో చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. తిరుపతి వేంకటకవులు లాంటి మహోన్నత వ్యక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించి.. ఆతిథ్యం తీసుకున్నట్టు చరిత్ర చెబుతోంది. ఇటీవల కాలంలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి తెలుగు మహాసభలను ఇక్కడ నిర్వహించారు. 

వనపర్తి–పెబ్బేరు ప్రధాన రహదారిలోని కంచిరావుపల్లి గ్రామం నుంచి శ్రీరంగాపురం ఆలయానికి చేరుకోవచ్చు. పెబ్బేరులోని 44వ నంబర్‌ జాతీయ రహదారి నుంచి ఈ ఆలయం 11 కి.మీ. దూరంలో ఉంటుంది. ఏటా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నుంచి ఉగాది పండుగ వరకు సుమారు 15 రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ఉట్టిపడే శిల్పసంపద
శ్రీరంగనాయకస్వామి ఆలయంలో నిర్మించిన అద్భుతమైన శిల్పసంపద భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వివిధ శిల్ప సంప్రదాయాలతోపాటు ద్వారపాలక శిల్పాలతో ఆకాశాన్నంటే అంతస్తులతో ఆలయ గోపురం భక్తులకు స్వాగతం పలుకుతోంది. శేషశయనుడై అభయహస్తం చూపుతూ స్వామివారు, ఆయనకు ఎడమవైపున చతుర్భుజ తాయారు ఆలయంలో శ్రీలక్ష్మీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

ఆలయం పక్కనే ఏడాది పొడవునా నీటితో కళకళలాడే రంగసముద్రం రిజర్వాయర్‌ ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఈ ఆలయంలో పలు సినిమాల షూటింగ్‌ నిర్వహిస్తారు. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేస్తున్నా.. నేటికీ కార్యరూపం దాల్చలేదు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)