Breaking News

చట్టబద్ధమని తెలిశాకే ప్రచారం చేశా..

Published on Sun, 11/16/2025 - 08:16

సాక్షి, హైదరాబాద్‌: చట్టబద్ధమైన యాప్‌ అని తెలుసుకున్న తర్వాతే తాను బెట్టింగ్‌ యాప్‌నకు ప్రచారం చేశానని సినీ నటుడు రానా దగ్గుబాటి స్పష్టం చేశారు. తన లీగల్‌ టీం అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ప్రమోషన్‌ చేసినట్టు వెల్లడించారు. బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో శనివారం సీఐడీ సిట్‌ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. కాగా, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్స్‌ కేసులో సీఐడీ సిట్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నటులను ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నారు. 

ఇప్పటికే సినీ నటులు విజయ్‌దేవరకొండ, ప్రకాశ్‌రాజ్‌ను ప్రశ్నించారు. ఇదే క్రమంలో శనివారం సిట్‌ ఎదుట సినీ నటుడు రానా దగ్గుబాటి, యాంకర్‌ విష్ణుప్రియ హాజరయ్యారు. సిట్‌ అధికారుల సూచన మేరకు బ్యాంకు స్టేట్‌మెంట్లతో హీరో రానా విచారణకు హాజరయ్యారు. ‘బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలు? తీసుకున్న పారితోషికం ఎంత? బెట్టింగ్‌ యాప్‌లను ఎందుకు ప్రమోట్‌ చేయాల్సి వచ్చింది? ఎవరు మీతో ఈ అగ్రిమెంట్లను కుదుర్చుకున్నారు?’అని ప్రశ్నించినట్టు తెలిసింది.

 2017 బెట్టింగ్‌ అండ్‌ గేమింగ్‌ యాప్‌ను రానా ప్రమోట్‌ చేశారు. అయితే, తాను స్కిల్‌ బేస్డ్‌ గేమ్‌ యాప్‌ను మాత్రమే ప్రమోట్‌ చేశానని సీఐడీ అధికారులకు రానా వివరించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా విష్ణుప్రియ మొత్తం మూడు బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఇచ్చిన సమన్ల మేరకు బ్యాంక్‌ అకౌంట్, స్టేట్‌మెంట్‌ వివరాలను విష్ణుప్రియ సిట్‌ అధికారులకు అందించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)