Breaking News

అమెరికాలో ఉన్నా బతికేదానివి తల్లీ..

Published on Thu, 06/17/2021 - 15:18

జ్యోతినగర్‌: అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను చూసేందుకు రామగుండం వచ్చిన నరిష్మారెడ్డి అనే యువతి కరోనా కాటుకు బలైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘అమ్మా.. నువ్వు అమెరికాలో ఉన్నా బతికే దానివి.. మమ్మల్ని చూడటానికి వచ్చి కరోనాకు బలైపోయావా తల్లీ..’ అంటూ తల్లడిల్లిపోతున్నారు.

పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ (రామగుండం)లోని కృష్ణానగర్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు నరిష్మారెడ్డి (27) అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసి అక్కడే నాలుగేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటానికి తల్లిదండ్రులు రామగుండం పిలిపించారు. దీంతో ఆమె నెల కిందట ఇక్కడికి వచ్చింది. అయితే ఆమె 20 రోజుల క్రితం అనారోగ్యం బారిన పడింది. కరోనా టెస్ట్‌ చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతోపాటు తల్లికీ పాజిటివ్‌రాగా, ఇద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

వారం కిందట మరోసారి టెస్ట్‌ చేయించుకోగా నరిష్మారెడ్డికి నెగెటివ్‌ వచ్చింది. అయినా ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. దీంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం రాత్రి ఆమె మృతిచెందింది. మంచి ఉద్యోగంతో అమెరికాలో క్షేమంగా ఉన్న కూతురు ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.   

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)