Breaking News

మేడిగడ్డకు కొత్త టెయిల్‌పాండ్‌!

Published on Thu, 10/31/2024 - 06:01

సాక్షి, హైదరాబాద్‌: పీడన శక్తి విడుదల(ఎనర్జీ డిస్సిపేషన్‌)కు సరైన ఏర్పాట్లు లేకపోవడంతోనే మేడిగడ్డ బరాజ్‌ కుంగిందని నిర్మాణ సంస్థ ‘ఎల్‌ అండ్‌ టీ’జరిపించిన ఓ మోడల్‌ స్టడీలో తేలింది. దీంతో తాత్కాలిక రక్షణ చర్యల్లో భాగంగా ఆ మేరకు ఏర్పాట్లు చేసేందుకు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్‌ఏ) నుంచి అనుమతులను ఇప్పించాలని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రామగుండం చీఫ్‌ ఇంజనీర్‌ కె.సుధాకర్‌రెడ్డి తాజాగా నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్‌)కు లేఖ రాశారు. మళ్లీ వర్షాకాలం రాకకు ముందు మిగిలి ఉండే సమయంలో ఈ పనులు చేయాల్సి ఉందని తెలియజేశారు.

జలాశయాల గేట్లు ఎత్తినప్పుడు విడుదలయ్యే వరద దిగువన తాకే సమయంలో నేల కోతకు గురై గుంతలు ఏర్పడతాయి. ఎందుకంటే గేట్ల నుంచి నీళ్లతో నిండే ఉండే జలాశయాల నుంచి విడుదలయ్యే వరదలో తీవ్రమైన పీడన శక్తి ఉంటుంది. వరద నేలను తాకే చోట తగిన పరిమాణంలో నీటి నిల్వలతో టెయిల్‌ ఉండేలా ఏర్పాట్లు చేయాలి. దీంతో టెయిల్‌పాండ్‌ నిల్వలో గేట్ల నుంచి వరద వచ్చి పడినా పీడన శక్తి నిర్వీర్యమై దిగువ ప్రాంతంలో ఎలాంటి నష్టాన్ని కలిగించదు.

మేడిగడ్డ బరాజ్‌ దిగువన తగిన నీటినిల్వలతో టెయిల్‌పాండ్‌ నిర్మించకపోవడంతోనే అక్కడ నేల కోతకు గురై భారీ గుంతలు ఏర్పడ్డాయని, క్రమానుగుణంగా గుంతలు పెద్దగా మారి బరాజ్‌ పునాదుల కింద ఇసుక జారిపోవ డానికి కారణమైందని ఎల్‌అండ్‌టీ నిర్వహించిన మోడల్‌ స్టడీస్‌లో తేలింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బరాజ్‌ దిగువన ఎనర్జీ డిస్సిపేషన్‌ కోసం టెయిల్‌పాండ్‌ సామర్థ్యం పెంపు చర్యలను తీసుకోవాలని భావిస్తున్నారు.

ఐఐటీ రూర్కీకి డిజైన్ల తయారీ అప్పగింత
టెయిల్‌పాండ్‌ పనులకు సంబంధించిన మోడ ల్‌ స్టడీస్‌ను ఐఐటీ రూర్కీతో నీటిపారుదల శాఖ చేయించింది. ఈ పనులకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సైతం అదే సంస్థ ఇవ్వనుంది. నీటిపారుదల శాఖలోని సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌(సీడీఓ) సీఈతో ఈ డిజైన్లకు ఆమోదం తీసుకొని పనులు ప్రారంభించేందుకు ఎన్డీఎస్‌ఏ నుంచి అనుమతి పొందాలని రామగుండం చీఫ్‌ ఇంజనీర్‌ ఈఎన్‌సీకి విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డ బరాజ్‌కు శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక సమర్పించే వరకు వేచిచూడకుండా ఈ మేరకు పనులు చేసేందుకు ఆయన అనుమతి కోరారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)