Breaking News

నేటినుంచి డీజీపీల కీలక సదస్సు

Published on Fri, 11/28/2025 - 04:38

సాక్షి, హైదరాబాద్‌: దేశ అంతర్గత భద్రత, వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం)ను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్‌ భద్రత, సరిహద్దు నిర్వహణ సహా పలు కీలక అంశాలపై శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జాతీయ స్థాయిలో డీజీపీ, ఐజీల సదస్సు జరగనుంది. ఈ హై–ప్రొఫైల్‌ భద్రతా సమావేశాన్ని తొలిసారిగా ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహిస్తున్నారు. సమావేశాల ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ముగింపు కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్న నేపథ్యంలో.. అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

సమావేశంలో తెలంగాణ తరపున డీజీపీ బి.శివధర్‌రెడ్డి, ఇతర సీనియర్‌ ఐపీఎస్‌లు హాజరుకానున్నారు. సమావేశంలో భాగంగా మహిళా భద్రత, సైబర్‌ భద్రత, వామపక్ష తీవ్రవాదం సహా మొత్తం ఐదు అంశాలపై డీజీపీ శివధర్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నట్టు తెలిసింది. మావోయిస్టులపై సాయుధ పోలీస్‌ బలగాలు పూర్తిస్థాయిలో పట్టు సాధిస్తున్న నేపథ్యంలో.. మావోయిస్టుల సమస్యను పూర్తిగా రూపుమాపేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని పదేపదే ప్రకటిస్తున్న నేపథ్యంలో.. అధికారులకు ఈ విషయంలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సైబర్‌ నేరాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాలపైనా కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)