Breaking News

మళ్లీ అకాల వర్ష బీభత్సం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వాన 

Published on Sun, 05/21/2023 - 02:54

వరంగల్‌/ జగిత్యాల/ మోత్కూరు/ ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలో మరోసారి అకాల వర్షాలు ప్రభావం చూపించాయి. శనివారం వివిధ జిల్లాల పరిధిలో తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. వర్షం తక్కువే కురిసినా.. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల ఇళ్లు, రేకుల షెడ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పిడుగుపాటు కారణంగా ఇద్దరు మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి.  

వరంగల్‌లో అతలాకుతలం.. 
శనివారం సాయంత్రం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వరంగల్‌ నగరంలో ఈదురుగాలుల ధాటికి సుమారు వంద ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చెట్లు కూలి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏనుమాముల మార్కెట్‌ సమీపంలో ఓ జిన్నింగ్‌ మిల్లు రేకులు లేచిపోయాయి.

హనుమకొండ జిల్లా శాయంపేటలో మామిడికి నష్టం వాటిల్లింది. పరకాల వ్యవసాయ మార్కెట్‌లో ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేటలో చెట్లు విరిగిపడ్డాయి. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి, లెంకాలపల్లి, నందిగామ, రేలకుంట, రు ద్రగూడెం, శనిగరం గ్రామాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. 

జగిత్యాల, యాదాద్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో..
జగిత్యాల జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, తీవ్ర ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో పలుచోట్ల చెట్లు విరిగిపడి కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. మినీస్టేడియం గోడ కూలిపోయింది.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూ రు వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం వాన ధాటికి కొట్టుకుపోయింది. తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. అకాల వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆగమాగమైంది. పలు మండలాల్లో అరగంట పాటు వర్షంతో పాటు వడగళ్లుపడ్డాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు, తీగలు తెగిపడటంతో అంధకారం అలముకుంది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, మొక్కజొన్నను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లుపడ్డారు.  

పిడుగుపాటుకు ఇద్దరు మృతి 
వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం భోజ్యనాయక్‌తండాకు చెందిన బానోతు సుమన్‌ పిడుగుపాటుతో మృతిచెందగా.. బానోతు భద్రు, బానోతు రమ, అజ్మీరా శశిరేఖలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇక జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం జగదేవుపేటలో మేకల కాప రి క్యాతం రాజయ్య (65) పిడుగుపాటుకు మృతిచెందాడు. బుగ్గారం మండలం సిరికొండలో పిడుగుపడి మరో మేకలకాపరి మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు.  

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)